Neethone Dance: బుల్లితెరపై సరికొత్త షో.. 8 జంటలతో 'నీతోనే డ్యాన్స్'.. యాంకర్, జడ్జెస్ ఎవరంటే?
ఈ మధ్య బుల్లితెరపై రియాలిటీ డ్యాన్స్ షోలు ఎక్కువైపోయాయి. ఇటీవలే ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ముగిసింది. అలాగే బిగ్ బాస్ తర్వాత ప్రవేశపెట్టిన బీబీ జోడీ డ్యాన్స్ షో కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఢీ షోలో న్యూ టాలెంటెడ్ డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ పర్ఫామెన్స్ ఇస్తే బీబీ జోడీలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అదిరిపోయే స్టెప్పులతో ఆకర్షించారు.
ఇప్పుడు బుల్లితెరపై మరో కొత్త డ్యాన్స్ షో రానుంది. ఇందులో సీరియళ్ల ద్వారా పాపులర్ అయిన నటీనటులు జంటలుగా సందడి చేయనున్నారు. 'నీతోనే డ్యాన్స్' అంటూ వస్తున్న ఈ సరికొత్త డ్యాన్స్ షో పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల ప్రజల్లో సీరియల్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధారావాహికల్లోని నటీనటులను తమ చుట్టుపక్కల మనుషులతో పోల్చుకుంటూ మరి వీక్షిస్తారు. అలాగే వారిపై అభిమానం పెంచుకుంటారు. అలాంటి సీరియల్స్ లో నటించే వాళ్లు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంటే. అవును, ఇప్పుడు ప్రముఖ ఛానెల్ స్టార్ మా బుల్లితెర నటీనటులతో సరికొత్త డ్యాన్స్ షో తీసుకొచ్చింది.
స్టార్ మా వేదికగా 'నీతోనే డ్యాన్స్' (Neethone Dance) అంటూ ప్రారంభం కానున్న డ్యాన్స్ షోకలో ఒకరిని మరొకరు ఢీ కొట్టేందుకు జంటలుగా రాబోతున్నారు. ఈ జంటల్లో కొందరు రియల్ లైఫ్ కపుల్స్ ఉంటే మరికొందరు రీల్ పెయిర్స్ ఉన్నారు. ఈ డ్యాన్స్ షోలో మొత్తంగా 8 జంటలు పాల్గొననున్నాయి. వారిలో ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న అమర్ దీప్-తేజస్విని, నిఖిల్-కావ్య, శివ కుమార్-ప్రియాంక, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీప, పవన్-అంజలి ఉన్నారు.
ఇక ఈ సరికొత్త డ్యాన్స్ షో 'నీతోనే డ్యాన్స్'కు న్యాయ నిర్ణేతలుగా అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ వ్యవహరించనున్నారు. ఈ ముగ్గురు ఇదివరకు బీబీ జోడీ రియాలిటీ డ్యాన్స్ షోకి సైతం జడ్జెస్ గా ఉన్నారు. ఇక ఈ షోకి యాంకర్ గా చేసిన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి కూడా 'నీతోనే డ్యాన్స్' షోకి హోస్ట్ గా చేయనుంది. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
'నీతోనే డ్యాన్స్' ప్రోమోలో పాల్గొనే జంటలను డ్యాన్సులతో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇందులో టక్కర్ మూవీ టీమ్ అయిన సిద్ధార్థ్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ సందడి చేశారు. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే ఈ డ్యాన్స్ షోను జూన్ 11న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. మరి ఈ షో ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











