ఆ ఫోజు దరిద్రంగా ఉంది.. పునర్నవిపై నెటిజన్ల సెటైర్లు..దెబ్బకు డిలీట్
బిగ్‌బాస్ షోతో ఫేమస్ అయిన పునర్నవి.. సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తరువాత హాట్ హాట్ పిక్స్‌తో హల్ చల్ చేస్తోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన క్షణం నుంచి ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తోన్న పునర్నవి.. ఇష్టమైన ప్రదేశాలను చుట్టేస్తూ.. ఇష్టమైన పదార్థాలను పుష్టిగా లాగించేస్తోంది. తాజాగా పునర్నవి పోస్ట్ చేసిన ఓ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బిగ్‌బాస్ మూడో సీజన్‌కే హైలెట్‌గా మారిని పునర్నవి, రాహుల్.. ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వారిద్దరి మధ్య రొమాన్స్, రిలేషన్, గొడవలు, అలకలు, తిట్లు ఇలా ప్రతీది అందర్నీ ఆకర్షించింది. వారిద్దరి కెమిస్ట్రీనే ఇంతటి పాపులర్‌కు కారణమైంది. టాస్క్‌లో ఎలాంటి ఎఫర్ట్ పెట్టకపోయినా.. బిగ్‌బాస్ హౌస్‌లో దాదాపు 70 రోజులు గడిపింది.

ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన పునర్నవి ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంది. పబ్‌లు, బీచ్‌లు, రెస్టారెంట్‌లు తిరుగుతూ.. బిగ్‌బాస్ ఫస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకుంది. తాజాగా పునర్నవి పోస్ట్ చేసిన పిక్ వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో పునర్నవి పెట్టిన పోజ్‌పై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
అక్కడ చేతులేందుకు పెట్టావ్.. ఏమైనా ప్రాబ్లమా.. నీకసలు పోజ్ ఇవ్వడమే రాదంటూ నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ప్రత్యేకంగా పోజులెందుకు నువ్వు నవ్వితే చాలు అందంగా ఉంటావ్.. ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.నెటిజన్ల ట్రోలింగ్స్‌కు బయపడ్డ పునర్నవి.. ఆ ఫోటోను డెలీట్ చేసింది.


Click it and Unblock the Notifications











