For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నేహా ఎలిమినేషన్ వెనుక కుట్ర.. అతడి వల్లే బయటకు.. వాళ్ల మీదే అనుమానం!

  |

  ఊహకే అందని విధంగా తెలుగు బుల్లితెరపై ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కంటెంట్‌తో నడిచేదే అయినా.. మన ప్రేక్షకులకు ఇది చాలా త్వరగానే చేరువైంది. అందుకే విజయవంతంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరోది కూడా ప్రారంభం అవగా.. దీనికి కూడా మంచి స్పందనే దక్కుతోంది. ఈ నేపథ్యంలో మూడో వారం హౌస్‌ నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. దీంతో ఆమె ఒకరిపై ఆరోపణలు చేసింది. ఆ వివరాలు మీకోసం!

  వాటిని దాటాలనుకుంటే షాక్

  వాటిని దాటాలనుకుంటే షాక్


  ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను ఒకదానికి మించి ఒకటి రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నా రేటింగ్ మాత్రం పెద్దగా రావట్లేదు.

  ఎద అందాలు ఆరబోసిన హీరోయిన్: డ్రెస్ ఉన్నా లేనట్లే దారుణంగా!

   గిచ్చి.. బుజ్జగించినట్లుగా నాగ్

  గిచ్చి.. బుజ్జగించినట్లుగా నాగ్


  శనివారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరిపై హెస్ట్ అక్కినేని నాగార్జున మరోసారి ఫైర్ అయ్యాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొంత మంది కంటెస్టెంట్లను సోఫా వెనుక నిల్చోబెట్టి క్లాస్‌ పీకాడు. అయితే, ఆదివారం మాత్రం ఫన్నీగా ఉంటుందని ముందుగానే వెల్లడించి టెన్షన్ పోగొట్టాడు. అందుకు తగ్గట్లుగానే ఎన్నో గేమ్స్ ఆడించి ఎపిసోడ్‌ను సరదాగా సాగించాడు.

   సుత్తి దెబ్బ.. ఆడియెన్స్ ఆట

  సుత్తి దెబ్బ.. ఆడియెన్స్ ఆట


  ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున హౌస్‌లోని కంటెస్టెంట్లతో సుత్తి దెబ్బ అనే ఆటను ఆడించాడు. దీని ప్రకారం.. ఎవరినైతే సెలెక్ట్ చేస్తాడో ఆ కంటెస్టెంట్ ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అది నిజమో కాదో అక్కడే ఉన్న ఆడియెన్స్‌ను అడుగుతారు. ఇందులో ఎక్కువ శాతం కంటెస్టెంట్లు చెప్పిన సమాధానాలకు ఆడియెన్స్ వ్యతిరేకంగా బదులు ఇచ్చారు.

  హాట్ షోతో పిచ్చెక్కిస్తోన్న నిహారిక: నెవ్వర్ బిఫోర్ ఫోజుతో అరాచకం

   తులాభారం.. నేహా బయటకు

  తులాభారం.. నేహా బయటకు


  గత వారం మొత్తానికి జరిగిన ఓటింగ్‌లో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్లను నాగార్జున సేఫ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక, చివర్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన వాసంతి కృష్ణన్, నేహా చౌదరి మిగిలారు. వీళ్లలో ఎలిమినేషన్ ఎవరో చెప్పడం కోసం నాగార్జున తులాభారం వేశాడు. ఇందులో నేహా చౌదరి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో హౌస్‌లో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి.

   దమ్ము, దుమ్ము కంటెస్టెంట్లు

  దమ్ము, దుమ్ము కంటెస్టెంట్లు


  ఎలిమినేట్ అయిన నేహా చౌదరితో నాగార్జున 'దమ్ము, దుమ్ము' అనే టాస్క్ ఆడించాడు. ఇందులో ఆమె ముందుగా దుమ్ము కంటెస్టెంట్లలో రేవంత్, ఇనయా, ఆరోహి, వాసంతి, గీతూ రాయల్ ఫొటోలను పెట్టింది. ఇక, దమ్మున్న కంటెస్టెంట్లుగా చంటి, సుదీప, రాజ్, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీ సత్య ఫొటోలను ఉంచింది. ఆ సమయంలో రాజ్‌తో మాట్లాడుతూ తెగ ఏడ్చేసింది.

  యాంకర్ విష్ణుప్రియ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో అస్సలు తగ్గకుండా!

  ఎలిమినేషన్ వెనుక అతడే

  ఎలిమినేషన్ వెనుక అతడే


  బిగ్ బాస్ ఆరో సీజన్‌ మూడో వారం షో నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయింది. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయింది. హౌస్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో 'నమ్మిన వాళ్లే నన్ను ముంచారు. వాళ్ల వల్లే ఎలిమినేట్ అయ్యానన్న బాధ, కోపంతో బయటకు వెళ్తున్నా' అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత స్టేజ్‌పై రేవంత్ వల్లే తాను ఎలిమినేట్ అయ్యాయని నేహా చెప్పుకొచ్చింది.

  ఎలిమినేషన్ వెనుక కుట్ర

  ఎలిమినేషన్ వెనుక కుట్ర


  వాస్తవానికి నేహా చౌదరి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గానే హౌస్‌లోకి అడుగు పెట్టింది. అయితే, గాయాల కారణంగా ఆమె సరిగా ఆడలేకపోయింది. అయినప్పటికీ హౌస్‌లో ఉన్న కొందరు కంటెస్టెంట్లతో పోల్చుకుంటే సూపర్‌గా ఆడింది. అలాంటిది నేహా ఎలా ఎలిమినేట్ అయిందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ టీమ్‌పై విమర్శలు చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Neha Chowdary Eliminated From This Show. Then She Put Allegations on Revanth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X