Neha Chowdary: విశ్వ అలా చేయడం వల్లే నేను నీతోనే డ్యాన్స్ షో మానేసా.. బిగ్‌బాస్ బ్యూటీ షాక్!

ఈ మధ్య కాలంలో అనేక అదిరిపోయే షోలు చేస్తున్నారు. ఓటీటీలు రావడంతో టెలివిజన్ షోలు చూసే వారి సంఖ్య తగ్గుతుండగా.. అద్భుతమైన షోలతో వస్తూ అందరినీ అలరించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఈక్రమంలోనే నీతోనే డ్యాన్స్ షో స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న, అలాగే సీరియల్స్ లో పాల్గొన్న అనేక మందిని తీసుకు వచ్చి ఈ డ్యాన్స్ షో చేయిస్తున్నారు. అయితే విశ్వకు జోడీగా నేహా చౌదరి చేస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న వీరిద్దరూ జోడీగా ఇరగదీస్తున్నారు. అయితే తాజాగా ఈమె... ఈ షో నుంచి తప్పుకుంది. అందుకు గల కారణాలు ఏంటో కూడా వివరించింది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే నేహా చౌదరి మొదటి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వతో జోడీగా మారింది. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ అలరిస్తోంది. చాలా కాలంగా వీరిద్దరూ జోడీగా కొనసాగగా.. తాజాగా ఈమె ఈ షో నుంచి తప్పుకుంది. ముఖ్యంగా నేహా చౌదరి స్థానంలోకి బిగ్ బాస్ తెలుగు 7 షోలో వైల్డ్ కార్ట్ ఎంట్రీగా పాల్గొన్న నయని పావని వచ్చింది. షో ప్రారంభంలో ఈమెకు ఆరోగ్యం బాగాలేకపోవడం.. ప్రిన్స్ యావర్ తో కలిసి ఇందులో పాల్గొనలేకపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వగా అంతా ఎగ్జైట్ అయిపోతున్నారు.

Neha Chowdary Revealed Why She Leaves Neethone Dance Show Check Details

అలాగే నేహా శెట్టి ఈ షోను వదిలిపోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఈమె ఎందుకు ఈ షోను వదిలి వెళ్లిపోయిందో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏమైంది, ఎందుకు మీరు నీతోనే డ్యాన్స్ షో చేయట్లేదని అడుగున్నారు. అయితే అభిమానుల బాధను అర్థం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా వాటిపై స్పందించింది. తాను ఈ షో ఎందుకు చేయట్లేదో కూడా చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా డ్యాన్స్ షో ప్రాక్టీస్ చేస్తుండగా... చాలా సార్లు తనకు చాలా దెబ్బలు తగిలాయని వాటి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కున్నట్లు చెప్పుకొచ్చింది. చాలా రోజులుగా తనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అసలు పని చేయట్లేదని.. నొప్పి విపరీతంగా ఉందని తెలిపింది. అయితే ఇది గుర్తించిన విశ్వ నువ్వు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాలని, చూయించుకోవాలని పట్టు బట్టాడట. ముఖ్యంగా ఆస్పత్రికి వెళ్లేవరకు పట్టుబట్టాడట. అలా ఆసుపత్రికి వెళ్లిన తనకు చేయి అంతా దెబ్బ తిన్నట్లు వైద్యులు చెప్పారట. ముఖ్యంగా ఆరు వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ చీసుకోవాలని.. మెడలు ఎటూ తిప్పకూడదని చెప్పారట.

Neha Chowdary Revealed Why She Leaves Neethone Dance Show Check Details

కేవలం మెడలు మాత్రమే కాదు.. చేతిని కూడా ఎక్కువగా కదిలించకూడదని వైద్యులు వివరించారట, లేకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని చెప్పారట. దీంతో ఆమె డ్యాన్స్ చేయడం మానేయాల్సి వచ్చింది. అలా తాను ఈషోకు దూరం కాగా.. నయని పావనికి అవకాశం వచ్చింది. ఇలా ప్రస్తుతం విశ్వ, నయని పావనిలు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X