For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: నాగార్జునపై నేహా సంచలన వ్యాఖ్యలు.. ఆయనకు నచ్చిన అమ్మాయి కోసమే అంటూ!

  |

  మన బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి భారీ స్పందన దక్కింది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇక, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నేహా చౌదరి హోస్ట్ నాగార్జునపై ఆరోపణలు చేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..

  మరింత కొత్తగా.. రేటింగ్‌లో షాక్

  మరింత కొత్తగా.. రేటింగ్‌లో షాక్

  తెలుగులో బిగ్ బాస్ ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నా రేటింగ్ విషయంలో షాక్ తగులుతోంది.

  పైన ఏమీ లేకుండానే పూజా హెగ్డే: ఫ్రంట్, బ్యాక్ కనిపించేలా హాట్ షో

  3వ వారంలో నేహా చౌదరి ఔట్

  3వ వారంలో నేహా చౌదరి ఔట్


  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో మొదటి వారంలో ఎవరూ ఎలిమినేట్ కాలేదు. కానీ, రెండో వారంలో మాత్రం ఏకంగా షానీ సాల్మన్, అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే మూడో వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నేహా చౌదరి బయటకు వెళ్లిపోయింది. దీంతో చాలా మంది షాక్ అయిపోయారు.

  నాగ్‌పై నేహా చౌదరి ఆరోపణలు

  నాగ్‌పై నేహా చౌదరి ఆరోపణలు


  నేహా చౌదరి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు ఆమె కచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం ఉందని చాలా మంది అంచనాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఫిజికల్ గేమ్ కూడా మంచిగా ఆడుతుండడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అంతా ఫిక్సైపోయారు. కానీ, అనూహ్యంగా నేహాను మూడో వారంలోనే బయటకు పంపారు. దీంతో ఆమె తాజాగా నాగార్జునపై ఆరోపణలు చేసింది.

  టూ పీస్ బికినీలో చరణ్ హీరోయిన్: ముఖం తప్ప ఆ పార్టులన్నీ కనిపించేలా!

  వాసంతి నుంచి రావట్లేదంటూ

  వాసంతి నుంచి రావట్లేదంటూ

  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నేహా చౌదరి మాట్లాడుతూ.. 'నేను ఎలిమినేట్ అయ్యానంటే చాలామంది నమ్మడం లేదు. దీన్ని అన్‌ఫెయిర్ అంటున్నారు. అసలు కంటెంట్ ఇవ్వని వాళ్లు హౌస్‌లోనే ఉన్నారు. వాళ్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ, వాసంతి దగ్గర నుంచి కంటెంట్ అస్సలు రావట్లేదు. గ్లామర్ డాల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఉంది' అని చెప్పుకొచ్చింది.

  నాగార్జున చాలా రాంగ్ అంటూ

  నాగార్జున చాలా రాంగ్ అంటూ

  ఆ తర్వాత నేహా కంటిన్యూ చేస్తూ.. 'ఇనయా విషయంలో ఇంట్లో వాళ్లు రాంగ్‌గానే మాట్లాడారు. కానీ, వీకెండ్‌లో నాగార్జున గారు వచ్చి నా వెర్షన్ తీసుకుని మొత్తం రివర్స్ చేసేశారు. నిజంగానే నాది మిస్టేక్ అయితే ఆ ఎపిసోడ్‌లో ఎందుకు హైలైట్ చేయలేదు? ఎందుకంటే నన్నుఎలిమినేట్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి.. నన్ను బ్యాడ్ చేశారు' అంటూ ఆరోపించింది.

  Indira Devi: మహేశ్ తల్లి గురించి సంచలన నిజాలు.. కృష్ణ రెండో పెళ్లి తర్వాత ఆమె ఏం చేశారో తెలిస్తే!

  వాళ్లకు నాగ్ ఫేవర్ చేస్తున్నారు

  వాళ్లకు నాగ్ ఫేవర్ చేస్తున్నారు


  నేహా మాట్లాడుతూ.. 'ఈ సీజన్‌లో నాగార్జున గారు ఫెయిర్‌గా ఉడడం లేదనే టాక్‌పై నేను కామెంట్ చేయదల్చుకోలేదు. నాకు డిప్లమేటిక్ ఆన్సర్‌లు ఇవ్వడం తెలియదు. అందుకే ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నాను. నాకైతే నాగార్జున గారు.. ఒకరిద్దరు కంటెస్టెంట్స్‌ను కావాలని హైలైట్ చేస్తున్నారనిపించింది. ఈ డౌట్ హౌస్‌లో వాళ్లు అందరికీ ఉంది' అని వెల్లడించింది.

  ఆర్జీవీతో ఫ్రెండ్‌షిప్ వల్లేనేమో

  ఆర్జీవీతో ఫ్రెండ్‌షిప్ వల్లేనేమో


  నేహా కంటిన్యూ చేస్తూ.. 'ఆర్జీవీ హీరోయిన్ అనే పేరుతో ఇనయా ఆమె హౌస్‌లోకి వచ్చింది. నాగార్జున గారికి ఆర్జీవీకి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది.. అందువల్లే ఆయన ఇనయా వైపు మాట్లాడుతున్నారా అన్నది తెలీదు. కానీ, ఎప్పుడైతే ఆర్జీవీ గారు ఇనయా స్టాండ్ తీసుకుని పోస్ట్ పెట్టారో.. ఆమెకు సేవ్ కావడానికి అది కూడా ఒక కారణం కావొచ్చు' అంటూ మాట్లాడింది.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Neha Chowdary Eliminated From This Show. Now She Put Allegations on Nagarjuna.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X