»   » సోనారికా బాటలో చిన్నారి పెళ్ళికూతురు: బికినీ లో దర్శనమిచ్చిన నేహా...

సోనారికా బాటలో చిన్నారి పెళ్ళికూతురు: బికినీ లో దర్శనమిచ్చిన నేహా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

టీవీ తారలంతా ఒకరి తర్వాత ఒకరుగా వరుస పెట్టి అందాలని ఆరబోస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లకు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో గానీ టీవీ హీరోయిన్లు కూడా బికినీల్లో ఉన్న తమ ఫొటోలను జనం లోకి వదుల్తున్నారు. మొన్నటికి మొన్న "దేవోన్‌ కా దేవ్‌ మహదేవ్‌" సీరియల్‌లో పార్వతి పాత్రలో నటించిన సోనారికా గతవారం కురచ దుస్తుల్లో కుర్రకారు హార్ట్ బీట్ పెంచగా.. ఇప్పుడు "బాలికా వధు" ఫేం నేహా కూడా తానేం తక్కువ కాదన్నట్టు బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు థాయలాండ్ వెళ్లిన అమ్మడు అక్కడి బీచుల్లో సేదతీరింది. సముద్రతీరంలో సెలవులను సరదాగా గడిపింది.,,ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. ఒడ్డున నిలబడి నీలాకాశం, సముద్రంను చూడడం అద్భుతంగా ఉందని, ఈ దృశ్యం తనకెంతో నచ్చిందని కూడా రాసింది. అయితే నేహా ఫొటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. సోనారికా బికినీ ఫొటోలపై సోషల్ మీడియాలో దుమారం రేగినా పట్టించుకోకుండా నేహా తన ఫొటోలు పోస్ట్ చేయడం గమనార్హం.

Neha marda in bikini looking so hot in instagram

అయితే నేహా విశయం లో మరీ అంత గొడవ జరక్క పోవచ్చు ఎందుకంటే సోనారికా ఒకప్పుడు హీదూ దేవత పార్వతీ దేవిగా నటించటం తో ప్రేక్షకులు ఆమెను అలా మాత్రమే గుర్తు పెట్టుకున్నారు. ఇప్పుడు నేహా మరీ గ్లామరస్ పాత్ర చేయకపోయినా దేవత లా మాత్రం కనిపించలేదు కాబట్టి... సర్దుకు పోతారు

కొద్దిరోజుల క్రితమే "దేవోన్‌ కా దేవ్‌ మహదేవ్‌" సీరియల్‌లో పార్వతి పాత్రలో నటించిన సోనారికా విశయం పెద్ద దుమారమే రేపింది . నిజానికి ఆమె ఇప్పుడు ఆ పాత్రలో నటించటం లెరదు. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సీరియల్ నుంచి తప్పుకొని కూడా మూడేళ్లవుతోంది. అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆమెను పార్వతీ దేవీ పాత్రలోనే గుర్తుంచుకున్నారు.

ఇటీవల సోనారికా భడోరియా విహార యాత్రకు వెళ్లింది. అక్కడి బీచ్ లో బికినీలతో దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సోనారికా పోస్టు చేసింది. అంతే, విమర్శలు, శాపనార్థాలు గుప్పిస్తూ నెటిజన్లు మండిపడ్డారు. పార్వతీదేవి పాత్రలో నటించి...ఇప్పుడు బికినీలు వేసుకున్న ఫొటోలు పోస్టు చేస్తారా? అంటూ ఆగ్రహించారు. నెటిజన్ల గోల భరించలేకపోయిన సోనారికా ఎట్టకేలకు తన ఫొటోలను డిలీట్ చేసింది

Read more about: balika vadhu
English summary
The TV actress posted photos of her Thailand vacay on Instagram, in which she’s posing in a bikini.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu