నువ్వు ఎన్నిసార్లు సె** చేశావ్: కుర్రాడి ప్రశ్నకు బిగ్ బాస్ సరయు షాకింగ్ రియాక్షన్
ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకో, సీరియళ్లలోకో, షోలలోకో ఎంట్రీ ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో ఎంతో మంది గ్లామర్ ఫీల్డులో రాణిస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ సరయు రాయ్ ఒకరు. క్రేజీ వీడియోలతో సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో సరయు రాయ్ లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెకు షాకిచ్చే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు మీకోసమే!
బుల్లితెరపైకి ఎంటరైనా
సరయు రాయ్ 2016లో వచ్చిన 'తొలి పరిచయం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా నటనా ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 'కార్‌పూల్' అనే షార్ట్ ఫిల్మ్‌తో బాగా పాపులర్ అయింది. అనంతరం టీవీల్లోకి ఎంటరై 'నిన్నే పెళ్లాడతా' సహా కొన్ని సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే సరయు చాలా సినిమాల్లోనూ అవకాశాలు దక్కింకున్నా గుర్తింపును అందుకోలేదు.

బోల్డ్ వీడియోలతో క్రేజ్
సుదీర్ఘ కాలం పాటు యాక్టింగ్ కెరీర్ కొనసాగించిన సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో బోల్డు వీడియోలతో సంచలనంగా మారింది. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ రెచ్చిపోయింది. దీంతో సరయు వీడియోకు భారీ స్పందన వచ్చింది. అదే సమయంలో ఆమె ఎన్నో వివాదాల్లో కూడా చిక్కుకుంది.
బిగ్ బాస్‌లో వరుసగానే
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఆఫర్ అందుకుంది. కానీ, ఫస్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కూడా అడుగు పెట్టింది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ప్రేక్షకులను అలరించింది. అయినప్పటికీ సరయు షో నుంచి ఎలిమినేట్ అయింది.

ఆ రోల్‌తో ఫుల్ ఆఫర్లు
గతంలో ఎన్నో చిత్రాల్లో నటించినా రాణించలేకపోయిన సరయు రాయ్.. '18 పేజెస్' మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో మెప్పించింది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. అలాగే, కొన్ని సిరీస్‌లలోనూ కీలక పాత్రలు చేస్తోంది.
అక్కడ యమా బిజీగా
సోషల్ మీడియా యమా ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సరయు రాయ్.. సుదీర్ఘ కాలం నుంచి ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా తన అభిమానాన్ని పెంచుకుంటోంది.

ఎన్ని సార్లు చేశావని
బోల్డు బ్యూటీ సరయు రాయ్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తోంది. ఇలా ఇటీవలే ఫాలోవర్లతో లైవ్ చాట్‌ను నిర్వహించింది. ఇందులో వాళ్లు ఎన్నో ప్రశ్నలు అడగ్గా.. వాటికి సమాధానాలు చెప్పింది. అయితే, ఓ నెటిజన్ మాత్రం 'నువ్వు ఎన్నిసార్లు సెక్స్ చేశావు' అంటూ సరయును సూటిగా ప్రశ్నించి షాకిచ్చాడు.
దీనికెలా చెప్తారురా
సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నను చూసి షాకైపోయిన సరయు రాయ్.. ఆ తర్వాత ఏ సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బంది పడింది. చివరికి 'దీనికి ఏం సమాధానం చెప్తారురా బాబు' అంటూ తల పట్టుకుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక, దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











