శ్రీముఖికి పెళ్లి సంబంధం: జోడీ బాగుంటుందన్న ఫ్యాన్.. రాములమ్మ ఏం అడిగిందో చూడండి!

తెలుగు బుల్లితెరపై తనదైన శైలి హోస్టింగ్‌తో సత్తా చాటుతూ దాదాపు ఏడేళ్లుగా స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శ్రీముఖి. సినిమా నటిగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారిన ఈమె.. అనతి కాలంలోనే అద్భుతమైన రీతిలో ఫాలోయింగ్‌ను అందుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ మధ్య బుల్లితెరపై పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని శ్రీముఖికి పెళ్లి సంబంధం చూశారు. ఈ విషయం ఆమెకు చెప్పగానే పక్కున నవ్వేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన శ్రీముఖి ప్రయాణం

అలా మొదలైన శ్రీముఖి ప్రయాణం

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్న సమయంలో అల్లు అర్జున్ నటించిన 'జులాయి'తో శ్రీముఖి నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో ఆకట్టుకోవడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'నేను శైలజ', 'జెంటిల్‌మెన్' వంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఆ తర్వాత 'ప్రేమ ఇష్క్ కాదల్', 'బాబు బాగా బిజీ' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గానూ చేసింది.

 అదుర్స్ నుంచి అదిరింది షో వరకు

అదుర్స్ నుంచి అదిరింది షో వరకు

సినిమా నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమయమంలోనే శ్రీముఖి 'అదుర్స్' అనే షోతో యాంకర్‌గా అడుగెట్టింది. ఆ తర్వాత ఆమె కెరీర్ ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వరుసగా షోలు చేస్తూ సత్తా చాటింది. తన కెరీర్‌లో ఆమె 'అదుర్స్ 2', 'మనీ మనీ', 'సూపర్ మామ్', 'సూపర్ సింగర్', 'జోలకటక', 'కామెడీ నైట్స్', 'బొమ్మ అదిరింది', 'పటాస్' వంటి షోలు చేసి స్టార్‌డమ్‌ను అందుకుంది.

సినిమాల విషయంలో యూటర్న్‌తో

సినిమాల విషయంలో యూటర్న్‌తో

వెండితెర ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీముఖి.. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఆ సమయంలో తనకు గ్లామర్ రోల్స్ మాత్రమే వస్తున్నాయని, అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈ బ్యూటీ ఈ సత్తిబాబు తెరకెక్కిస్తోన్న 'క్రేజీ అంకుల్స్'లో మరోసారి లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ నటిస్తోన్న 'మాస్ట్రో'లో నటించిందామె.

అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న భామ

అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న భామ

వరుస షోలు, సినిమాలతో బిజీగా ఉన్నా.. శ్రీముఖి మాత్రం ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన అందచందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో పలుమార్లు ఇంటర్నెట్‌ను షేక్ చేసేసింది కూడా.

ప్రశ్నలు జవాబులతో సందడి చేస్తూ

ప్రశ్నలు జవాబులతో సందడి చేస్తూ

సామాజిక మాధ్యమాల్లో ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి.. అందులో ఎక్కువ శాతం ఇన్‌స్టాగ్రామ్‌కే సమయం కేటాయిస్తోంది. ఇందులో ఆమె గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అందాల విందు చేస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లను నిర్వహిస్తోంది. ఇందులో తన గురించి, తన ఫ్యామిలీ గురించి వాళ్లు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తోంది.

Recommended Video

Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
సంబంధం చూసిన ఫ్యాన్.. జావాబిలా

సంబంధం చూసిన ఫ్యాన్.. జావాబిలా


తాజాగా యాంకర్ శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ ఔత్సాహిక నెటిజన్ 'అక్కా.. ఒక మంచి సంబంధం ఉంది. మాట్లాడదామా? నీకు పర్‌ఫెక్ట్ జోడీ అక్కా' అని అడిగారు. దీనికి శ్రీముఖి పక్కున నవ్వేస్తూ.. ఊహించని విధంగా 'లాల్.. ఎవరది' అని కూడా అడిగింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X