For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయకు బిగ్ షాక్: రెండో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్.. ఆమె రియాక్షన్ చూశారంటే!

  |

  అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై తనదైన హోస్టింగ్‌తో సందడి చేస్తోంది. అదే సమయంలో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో మాయ చేస్తోంది. ఫలితంగా ఈ సుందరాంగి తన ఫాలోయింగ్‌ను క్రమంగా పెంచుకుంటూనే ఉంటోంది. దీంతో అనసూయకు అటు సినిమా, ఇటు టీవీ షోల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, అనసూయ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్రాడు ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

  అలా పరిచయం.. జబర్ధస్త్‌గా

  అలా పరిచయం.. జబర్ధస్త్‌గా


  అప్పుడెప్పుడో ఓ సినిమాలో తళుక్కున మెరిసిన తర్వాత అనసూయ భరద్వాజ్ న్యూస్ యాంకర్‌గా అందరికీ సుపరిచితురాలు అయింది. అనంతరం జబర్ధస్త్ షో ద్వారా యాంకర్‌గా పరిచయం అయింది. అందులో అద్భుతమైన హోస్టింగ్, అదిరిపోయే అందంతో మాయ చేసి అందరి దృష్టిలో పడిపోయింది. అప్పటి నుంచి అనసూయ కెరీర్ జబర్ధస్త్‌గా సాగిపోతుందని చెప్పొచ్చు.

  కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!

  సినిమాల్లో సత్తా చాటిందిగా

  సినిమాల్లో సత్తా చాటిందిగా


  బుల్లితెరపై తనదైన హోస్టింగ్‌తో అలరిస్తూ ఎన్నో విజయవంతమైన షోలు చేసిన అనసూయ భరద్వాజ్.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది.

  వరుసగా సినిమాలతో హవా

  వరుసగా సినిమాలతో హవా


  సినీ రంగంలో తనదైన నటనతో మాయ చేస్తోన్న అనసూయకు ఆఫర్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడామె వరుసగా 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'గాడ్ ఫాదర్', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. దీంతో బుల్లితెరపై పెద్దగా షోలను మాత్రం ఒప్పుకోవట్లేదు. దీనిపై ఫ్యాన్స్ మాత్రం నిరాశగా ఉన్నారు.

  Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!

  ఈటీవీని వీడి.. ఆ ఛానెల్‌లో

  ఈటీవీని వీడి.. ఆ ఛానెల్‌లో

  అనసూయ భరద్వాజ్ ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారానే కెరీర్‌ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అందుకే అదే ఛానెల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసింది. అయితే, ఇటీవలే ఈ బ్యూటీ స్టార్ మాలోకి వెళ్లిపోయింది. ఇందులో సుడిగాలి సుధీర్‌తో కలిసి అనసూయ ఓ పిల్లల కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. దీనిపై జబర్ధస్త్ ప్రియులు అసంతృప్తి చెందారు.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి

  వరుసగా సినిమాలు, షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న అనసూయ భరద్వాజ్.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

  ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: సీక్రెట్ పార్ట్ కనిపించేలా ఘోరంగా!

  పెళ్లి చేసుకోమంటూ రిక్వెస్ట్

  పెళ్లి చేసుకోమంటూ రిక్వెస్ట్

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది. ఇందులో తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆమె విసుగు చెందకుండా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ తనను పెళ్లి చేసుకోమంటూ అనసూయకు ప్రపోజల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.

  ఏమీ చెప్పలేకపోయిందిగా

  ఏమీ చెప్పలేకపోయిందిగా


  అనసూయ భరద్వాజ్ నిర్వహించిన చిట్ చాట్‌లో సదరు నెటిజన్ 'నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను ఎన్నోసార్లు అడిగాను. కానీ, నువ్వు మాత్రం అస్సలు స్పందించలేదు' అని అడిగాడు. దీనికామె ఏమీ మాట్లాడకుండా ఉండే ఎమోజీని పోస్ట్ చేసింది. అలాగే, ఆలోచిస్తున్నట్లు ఉన్న తన ఫొటోను కూడా షేర్ చేసింది. దీంతో వీళ్లిద్దరి సంభాషణ హాట్ టాపిక్ అయిపోయింది.

  English summary
  Tollywood actress and Anchor Anasuya Bharadwaj Very Busy in Social Media. Recently Netizen Sends Marriage Proposal to her Via Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X