అనసూయ లెస్బియన్ అనుభవం.. ‘గే’లతోనూ ఎక్స్‌పీరియన్స్.. ఎఫైర్స్‌పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెరపై తనదైన అందం, టాలెంట్, వాక్చాతుర్యంతో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది అనసూయ భరద్వాజ్. సుదీర్ఘ కాలం పాటు టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ఈ అమ్మడు.. ఈ మధ్య సినిమాల్లోనూ హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా వరుస ఆఫర్లతో సందడి చేస్తోంది. అదే సమయంలో అనసూయ సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చిట్ చాట్ నిర్వహించగా.. ఆమెకు ఓ నెటిజన్ షాకిచ్చాడు. అసలేం జరిగింది? మీరే చూసేయండి!

జబర్ధస్త్‌గా వెళ్తోన్న అనసూయ

జబర్ధస్త్‌గా వెళ్తోన్న అనసూయ

న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన అనసూయ భరద్వాజ్ 'జబర్ధస్త్' కామెడీ షోతో యాంకర్‌గా మారింది. ఇందులో గ్లామర్‌తో పాటు అద్భుతమైన హోస్టింగ్‌తో మెప్పించిన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపు దక్కించుకుంది. తద్వారా ఫాలోయింగ్‌తో పాటు వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది.

మూవీల్లో సత్తా... ఉత్తమ నటన

మూవీల్లో సత్తా... ఉత్తమ నటన

టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్‌గా సత్తా చాటిన అనసూయ.. 'సోగ్గాడే చిన్ని నాయన'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం', 'థ్యాంక్యూ బ్రదర్', 'ఖిలాడీ', 'పుష్ప' సహా ఎన్నో చిత్రాలతో సత్తా చాటింది. అలాగే, కొన్ని మూవీల్లో స్పెషల్ సాంగ్‌లలోనూ మెరిసింది. ఇలా వెండితెరపైనా ప్రభావాన్ని చూపిస్తోంది.

ఎన్నో ఆఫర్లు... వాటిలో కూడా

ఎన్నో ఆఫర్లు... వాటిలో కూడా

ఈ మధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ మరిన్ని సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె 'మైఖేల్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే, వరుసగా 'రంగమార్తాండ', 'వేదాంతం రాఘవయ్య', 'హరిహర వీరమల్లు', 'పుష్ప 2', 'భోళా శంకర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, వేరే భాషల్లోనూ సినిమాలు ఒప్పుకుంటోంది.

టీవీకి దూరంగా.. అదే కారణం

టీవీకి దూరంగా.. అదే కారణం

తనకు లైఫ్ ఇచ్చిన జబర్ధస్త్‌తో పాటు ఈటీవీ నుంచి తప్పుకున్న అనసూయ భరద్వాజ్.. ఆ మధ్య స్టార్ మాలోకి అడుగు పెట్టింది. అందులో ప్రసారం అయిన 'సూపర్ సింగర్ జూనియర్' షోకు ఆమె సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా చేసింది. ఈ షో పూర్తైన తర్వాత నుంచి అనసూయ బుల్లితెరపై కనిపించడం లేదు. సినిమాలు ఎక్కువగా ఉండడం వల్లే ఆమె షోలు చేయట్లేదని టాక్.

అందులో మాత్రం ఫుల్ బిజీ

అందులో మాత్రం ఫుల్ బిజీ

వరుసగా షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన ఫొటోలు, వీడియోల తన ఖాతాల్లో షేర్ చేస్తుంటోంది. అలాగే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ సంబంధిత విశేషాలను పంచుకుంటోంది. దీంతో ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది.

లెస్బియన్ ఎన్‌కౌంటర్ అని

లెస్బియన్ ఎన్‌కౌంటర్ అని

అనసూయ భరద్వాజ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిట్ చాట్‌ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది నెటిజన్లు ఆమె ఓపికకు పరీక్ష పెట్టే ప్రశ్నలు అడిగారు. వీటికామె మంచిగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'నువ్వు ఉదారవాద, పరిణితి చెందిన మహిళవే అయితే దీనికి ఆన్సర్ చెయ్. నీకు లెస్బియన్‌ ఎక్స్‌పీరియన్స్ ఉందా' అని అడిగాడు.

చాలా మంది.. అందులోనే

చాలా మంది.. అందులోనే

నెటిజన్ ప్రశ్నకు అనసూయ 'నా ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీలో ఎంతో మంది గేలు ఉన్నారు. కానీ, నేను ఎప్పుడూ వాళ్లతో పర్సనల్‌గా నువ్వు అడిగినటువంటి రిలేషన్‌షిప్‌ను పెట్టుకోలేదు. అయితే ఆన్‌లైన్‌లో మాత్రం చాలా ఉన్నాయి' అని చెప్పుకొచ్చింది. అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోన్నాయి. అలాగే, ఈ స్క్రీన్‌షాట్స్ తెగ వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X