గెటప్ శ్రీను పరువు తీసిన నెటిజన్: సుధీర్‌ను కూడా వదల్లేదు.. ఊహించని ప్రశ్నకు షాకింగ్ రిప్లై

తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తూ ఉంటుంది. అందుకే కొన్ని షోలు ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో జబర్ధస్త్ ఒకటి. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ షో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇక, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో గెటప్ శ్రీను ఒకడు. బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్లిన అతడికి సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. తాజాగా శ్రీనుకు ఓ నెటిజన్ కోలుకోలేని షాకిచ్చాడు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

అలా పరిచయమయ్యాడు.. చాలా ఫేమస్

అలా పరిచయమయ్యాడు.. చాలా ఫేమస్

శ్రీను కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేసేవాడు. అలాగే, ఎంతో మందిని చక్కగా ఇమిటేట్ చేసేవాడు. ఆ సమయంలో వేణు ద్వారా జబర్ధస్త్‌లోకి అడుగు పెట్టాడు. ఆ వెంటనే తనలోని టాలెంట్‌ను బయట పెట్టుకున్న అతడు.. చాలా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్‌తో కలిసి ఓ టీమ్‌గా ఏర్పడ్డాడు. ఈ క్రమంలోనే ఎన్నో స్కిట్లను నిలబెట్టాడు.

అలాంటి పాత్రలు.. గెటప్ శ్రీనుగా పాపులర్

అలాంటి పాత్రలు.. గెటప్ శ్రీనుగా పాపులర్

జబర్ధస్త్‌లో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. కానీ, అందులో కేవలం కొందరు మాత్రమే అద్భుతమైన టాలెంట్‌తో గుర్తింపును దక్కించుకుంటున్నారు. అందులో విచిత్రమైన పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే శ్రీను పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. స్కిట్టు స్కిట్టుకు ఏదో ఒక రకమైన గెటప్‌ వేస్తోన్న అతడు జబర్ధస్త్‌లోనే టాప్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు.

సినిమాల్లోకి ఎంట్రీ.. ఏకంగా చిరంజీవితోనే

సినిమాల్లోకి ఎంట్రీ.. ఏకంగా చిరంజీవితోనే

బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తున్న గెటప్ శ్రీను.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు. అందులో చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150', రామ్ 'ఇస్మార్ట్ శంకర్', నాని 'గ్యాంగ్ లీడర్', 'రంగస్థలం', 'దిక్కులు చూడకు రామయ్య', 'సినిమా చూపిస్త మావా', 'వేర్ ఈజ్ విద్యాబాలన్' తదితర చిత్రాలు అతడికి మంచి పేరును తెచ్చాయి.

వాళ్లతో హీరోగా... ఇప్పుడు సోలోగా ఇలా

వాళ్లతో హీరోగా... ఇప్పుడు సోలోగా ఇలా

జబర్ధస్త్ టీమ్ సభ్యులు సుడిగాలి సుధీర్.. రాంప్రసాద్‌తో కలిసి ఆ మధ్య 'త్రీ మంకీస్' అనే సినిమాలో హీరోగా నటించాడు గెటప్ శ్రీను. ఇక, ఇప్పుడు 'రాజు యాదవ్' అనే మూవీతో సోలో హీరోగా పరిచయం అవుతున్నాడు. 'నీది నాది ఒకే క‌థ‌', 'విరాట‌ప‌ర్వం' చిత్రాల‌కు చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన కృష్ణ‌మాచారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంకిత క‌ర‌త్ హీరోయిన్‌.

అందులో మాత్రం బిజీగానే... అన్నీ చెప్పి

అందులో మాత్రం బిజీగానే... అన్నీ చెప్పి


వరుస సినిమాలు, షోలతో బిజీగా ఉన్నప్పటికీ.. గెటప్ శ్రీను సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఇందులో భాగంగానే తన ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటుంటాడు. అదే సమయంలో ఎన్నో విషయాలపై స్పందిస్తుంటాడు. ఇక, ఈ మధ్య తరచూ ఫ్యాన్స్‌తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లు నిర్వహిస్తున్నాడు.

గెటప్ శ్రీను పరువు తీసేసిన ఓ నెటిజన్

గెటప్ శ్రీను పరువు తీసేసిన ఓ నెటిజన్

తాజాగా గెటప్ శ్రీను తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా వాళ్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పాడు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్.. 'మీ స్కిట్లు ముందంతా బాగానే ఉంటాయి. కానీ లాస్ట్‌కు సరైన ముగింపు ఉండదెందుకు? అందుకే ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారా?' అంటూ వాళ్ల టీమ్ పరువు తీశాడు.

ఊహించని ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు

ఊహించని ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు

సదరు నెటిజన్ అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను సీరియస్ అవుతాడని అంతా అనుకుంటారు. కానీ, అతడు మాత్రం ఊహించని విధంగా 'ఈ సారి మంచి ముగింపుతో చేస్తాం. థ్యాంక్యూ' అంటూ రిప్లై ఇచ్చాడు. అంటే.. నెటిజన్ చెప్పిన మాటను గౌరవంగా స్వీకరించడంతో పాటు ఆ సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. దీనిపై గెటప్ శ్రీనును అందరూ అభినందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X