నీకు బాగా పెరిగిందని అషు రెడ్డికి నెటిజన్ షాక్: అవును అంటూ ఏకంగా అది చూపించిన బ్యూటీ

ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తోన్నారు. అందులో వైజాగ్ చిన్నది అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోలతో వెలుగులోకి వచ్చిన ఈ భామ.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇక, సోషల్ మీడియాలో సందడి చేసే అషు రెడ్డికి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్ షాకిచ్చాడు. దీంతో ఆమె ఊహించని పని చేసింది. ఆ వివరాలు మీకోసమే!

జూనియర్ సమంత.. సినిమాల్లో

జూనియర్ సమంత.. సినిమాల్లో

చాలా కాలం క్రితం హల్‌చల్ చేసిన డబ్‌స్మాష్ వీడియోలతో అషు రెడ్డి వెలుగులోకి వచ్చింది. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఆమెను అందరూ జూనియర్ సామ్ అనేవాళ్లు. దీంతో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే అషు 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. అమెరికాకు చెక్కేసింది.

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ ఫేమస్

యూఎస్‌లో ఉన్న సమయంలో పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా అషు రెడ్డి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే, ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి ఎన్నో షోలు, ఈవెంట్లలోనూ హడావిడి చేసింది.

మళ్లీ ఛాన్స్.. నిరాశగానే వెనక్కి

మళ్లీ ఛాన్స్.. నిరాశగానే వెనక్కి

బిగ్ బాస్ మూడో సీజన్‌లో నిరాశనే ఎదుర్కొన్న అషు రెడ్డి.. గత ఏడాది ప్రసారం అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా రీఎంట్రీ ఇచ్చేసింది. ఇందులో ఆమె గతంలో కంటే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం.. హాట్‌గా కనిపించడం వంటివి చేసి హైలైట్‌ అయింది. అయినప్పటికీ ఈ సీజన్‌లో కూడా అషు ఫినాలేకు చేరకుండానే బయటకు వచ్చేసింది.

వరుస టూర్లు.. ఫుల్ ఎంజాయ్

వరుస టూర్లు.. ఫుల్ ఎంజాయ్

బిగ్ బాస్ నాన్ స్టాప్ తర్వాత అషు రెడ్డి మరింతగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఒకవైపు వరుసగా షోల మీద షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోంది. అదే సమంయలో తరచూ విదేశీ పర్యటనలతో ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు తరచూ దుబాయ్, మియామీలో కూడా వెళ్లొచ్చింది. అలాగే, ఇప్పుడు కూడా తరచూ ఏదో టూర్‌కు వెళ్తూ బిజీగా మారింది.

సోషల్ మీడియాలో హడావిడి

సోషల్ మీడియాలో హడావిడి

సోషల్ మీడియా ద్వారానే అషు రెడ్డి పాపులర్ అయిందని అందరికీ తెలిసిందే. అందుకే దీనివల్లే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఫలితంగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

నీకు బాగా ఎక్కువైంది అంటూ

నీకు బాగా ఎక్కువైంది అంటూ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఆమె ఓపికగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ 'నీకు ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది గమనించావా' అంటూ అషు రెడ్డికి షాకిచ్చాడు.

 చెప్పు చూపించిన అషు రెడ్డి

చెప్పు చూపించిన అషు రెడ్డి

నెటిజన్ అన్న మాటకు అషు రెడ్డి ఏమాత్రం కోప్పడకుండానే సమాధానం చెప్పంది. 'అవును.. నాకు ఓవర్ యాక్షన్ పెరగడం కాదు.. గతంతో పోల్చుకుంటే చాలా తగ్గింది' అంటూ కామెంట్ చేసింది. పైగా దీనికి ఓ చెప్పు ఎమోజీని కూడా చూపించింది. ఫలితంగా అతడికి చెప్పును చూపించినట్లు అయింది. ఇక, అషు రెడ్డి కౌంటర్‌కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X