అషు రెడ్డికి నెంబర్ ఇచ్చిన కుర్రాడు: చివర్లో బిగ్ ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తెలుగు అమ్మాయిలు విపరీతంగా ఫేమస్ అయిపోయారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు సినిమా, సీరియళ్లు, షోలు ఇలా ఎన్నో ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అషు రెడ్డి. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండే ఈ అమ్మడు.. ఆరంభంలోనే ఎనలేని ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ఓ నెటిజన్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

 జూనియర్ సమంతగా గుర్తింపు

జూనియర్ సమంతగా గుర్తింపు

అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోల ప్రభావం దేశ వ్యాప్తంగా భారీగా కనిపించేది. దీని ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు. సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు పెరిగారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు తన పర్సనల్ కెరీర్‌ మీదనే ఫుల్‌గా ఫోకస్ చేసేసింది.

ఆ షో తర్వాత కెరీర్ మారింది

ఆ షో తర్వాత కెరీర్ మారింది

ఒక్క సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి అమెరికాకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో విజయం సాధించకపోయినా ఈ అమ్మడు మంచి గుర్తింపును అందుకుంది. దీంతో ఆమె కెరీర్‌కు ఊపొచ్చింది.

లవ్ ట్రాకులతో మరింత పేరు

లవ్ ట్రాకులతో మరింత పేరు

బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి అనుమానాలు పెంచింది.

యాంకర్‌గా సందడి చేస్తోంది

యాంకర్‌గా సందడి చేస్తోంది

ఈ మధ్య కాలంలో అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే 'కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో స్కిట్లలో నటించింది. అదే సమయంలో 'హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గా మారింది. ఇందులో ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి స్పెషల్ ఈవెంట్లు, షోలలో సందడి చేస్తోంది.

 అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే

సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంటోంది.

 నెంబర్ సెండ్ చేసిన నెటిజన్

నెంబర్ సెండ్ చేసిన నెటిజన్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి.. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో ఎంతో మంది నెటిజన్లు ఆమెను వింత వింత ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే ఒకరు 'నాకు నీతో మాట్లాడాలని ఉంది. ఇది నా నెంబర్. ప్లీజ్ కాల్ మీ అక్క' అంటూ మెసేజ్ పెట్టారు. దీనికి అషు తలపట్టుకుని రియాక్షన్ ఇచ్చింది.

 డిలీట్ చేయమంటూ రిక్వెస్ట్

డిలీట్ చేయమంటూ రిక్వెస్ట్

ఇదే సెషన్‌లో చాలా మంది చాలా రకాల ప్రశ్నలతో అషు రెడ్డిని ఇబ్బంది పెట్టారు. ఈ క్రమంలోనే నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్న నెటిజన్ 'అక్కా.. కాల్స్‌తో చంపుతున్నారు. దయచేసి నేను అంతకు ముందు చేసిన పోస్టును డిలీట్ చేయ్' అని మరో మెసేజ్ పెట్టాడు. దీనికి అషు రెడ్డి నవ్వుతూ 'ఫోన్ సర్వీస్‌ను బాగా ఎంజాయ్ చేయ్' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X