నువ్వు వర్జిన్‌వేనా అంటూ అషు రెడ్డికి నెటిజన్ ప్రశ్న: ఇండైరెక్టుగా బదులిచ్చిన బ్యూటీ

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని, భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో వైజాగ్ చిన్నది అషు రెడ్డి ఒకరు. అప్పట్లో ఫేమస్ అయిన డబ్‌స్మాష్ వీడియోలతో వెలుగులోకి వచ్చిన ఈ భామ.. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో సందడి చేసే అషు రెడ్డి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ ఆమెను నువ్వు కన్యవేనా అని ప్రశ్నించాడు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు మీకోసం!

సమంతలా.. సినిమా, షో ఆఫర్లు

సమంతలా.. సినిమా, షో ఆఫర్లు

అషు రెడ్డి చూడ్డానికి అచ్చం సమంతలానే ఉండేది. దీంతో ఆమెకు జూనియర్ సామ్ అనే పేరు వచ్చింది. అప్పుడే ఆమెకు ఎన్నో అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో నటించింది. తద్వారా మరింత పాపులర్ అయింది. అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లిపోయింది. దీంతో కెరీర్‌కు బ్రేక్ ఇచ్చేసింది.

బిగ్ బాస్ ఛాన్స్.. వరుస షోలు

బిగ్ బాస్ ఛాన్స్.. వరుస షోలు

అమెరికా నుంచి వచ్చిన వెంటనే అషు రెడ్డి బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'హ్యాపీ డేస్' షో చేసింది. అలాగే, 'కామెడీ స్టార్స్'లోనూ సందడి చేసింది. అప్పటి నుంచి వరుసగా షోలను చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

ఓటీటీలో మాత్రం తన మార్క్

ఓటీటీలో మాత్రం తన మార్క్

బిగ్ బాస్ షోలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిన అషు రెడ్డికి ఇటీవలే స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం దక్కింది. ఇందులో ఆమె మరింతగా రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది. కానీ, ఈ సీజన్‌లో కూడా ఈమె విజయం సాధించలేక.. ఫినాలే ముందే వెళ్లిపోయింది.

ఫుల్ బిజీగా... వరుసగా ట్రిప్స్

ఫుల్ బిజీగా... వరుసగా ట్రిప్స్


బిగ్ బాస్ నాన్ స్టాప్ తర్వాత అషు రెడ్డి స్పీడు పెంచేసింది. దీని ద్వారా బాగానే రెమ్యూనరేషన్ అందుకున్న ఈ చిన్నది.. తరచూ విదేశీ ట్రిప్‌లకు వెళ్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఎన్నో సినిమాలు, షోల ఆఫర్లను కూడా దక్కించుకుంది. దీంతో అటు కెరీర్ పరంగా.. ఇటు పర్సనల్ లైఫ్ పరంగానూ ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగుతోంది.

సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో హల్‌చల్


సోషల్ మీడియా ద్వారానే అషు రెడ్డి పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. అందుకే దీనివల్లే ఈ అమ్మడు తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. అలాగే, అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. అంతేకాదు, ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. మరీ ముఖ్యంగా అషు రెడ్డి ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తూ తెగ హైలైట్ అవుతోంది.

నువ్వు కన్యవేనా అంటూ ప్రశ్న

నువ్వు కన్యవేనా అంటూ ప్రశ్న

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అషు రెడ్డి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో తన ఫాలోవర్లు అడిగిన ఎన్నో అడ్డదిడ్డమైన ప్రశ్నలకు ఆమె ఓపికగానే సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక నెటిజన్ 'నువ్వు వర్జిన్ (కన్య) వేనా' అంటూ అషు రెడ్డిని సూటిగా ప్రశ్నించి షాకిచ్చాడు.

ఇండైరెక్ట్‌గా బదులిచ్చిన భామ

ఇండైరెక్ట్‌గా బదులిచ్చిన భామ

నెటిజన్ అడిగిన ప్రశ్నకు అషు రెడ్డి ఏమాత్రం కోప్పడకుండానే సమాధానం చెప్పంది. కన్యవేనా అంటూ అతడు అడగ్గానే 'Virgo' అంటూ కన్యా రాశి సింబల్‌ను చూపిస్తూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో సదరు నెటిజన్‌పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X