ప్రెగ్నెంట్ అవ్వాలంటూ యాంకర్ శ్యామలను కోరిన నెటిజన్: దీనికి ఆమె రియాక్షన్ చూశారంటే!
తెలుగు ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ఎంతో మంది లేడీస్ యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో కాకినాడ భామ శ్యామల ఒకరు. నటిగా కెరీర్‌ను ఆరంభించి.. యాంకర్‌గా స్థిర పడిన ఆమె.. దాదాపు పదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఫలితంగా ఎంతో మంది అభిమానాన్ని అందుకోవడంతో పాటు వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. రాజకీయాల్లోనూ కాలు మోపింది. ఇక, ఇటీవలే ఆమె భర్త ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా యాంకర్ శ్యామల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఒక నెటిజన్ శ్యామలను ప్రెగ్నెంట్ అవమంటూ రిక్వెస్ట్ చేశాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

శ్యామల అలా వచ్చి.. ఇలా ఫేమస్
శ్యామల టీనేజ్‌లోనే నటిగా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే తన టాలెంట్‌తో బాగా ఫేమస్ అయింది. ఆమె ప్రయాణంలో ‘లయ', ‘అభిషేకం', ‘గోరింటాకు' వంటివి పేరు తెచ్చాయి. ఆ తర్వాత యాంకర్‌గా మారి ‘మా ఊరి వంట', ‘పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. అలాగే ‘లౌక్యం', ‘ఒక లైలా కోసం' సహా పలు సినిమాల్లోనూ నటించింది.

ఆ సీరియల్ నటుడితో ప్రేమ పెళ్లి
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెరపై సత్తా చాటుతోన్న నటుడు నరసింహాతో ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే పెద్దలను ఎదురించి.. ఆ తర్వాత ఒప్పించారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. వీళ్లకు ఓ కుమారుడు కూడా జన్మించాడు.

రాజకీయాల్లో.. వాళ్లను కలవడంతో
వరుస పెట్టి సినిమాలు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ బిజీగా గడుపుతోన్న యాంకర్ శ్యామల.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేసింది. ఈ క్రమంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక, ఈ మధ్య ఆమె షర్మిలనూ కలిసింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ యాంకర్ హాట్ టాపిక్ అయింది.

వివాదాలు.. భర్తకు సపోర్టుగా పోస్ట్
యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి ఆ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ మహిళ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బుల్లితెరపై కలకలం రేగింది. ఈ ఘటనపై యాంకర్ శ్యామల కూడా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా తన భర్తకు బాసటగా నిలిచింది. ఈ మేరకు కొన్ని పోస్టులను కూడా చేసింది.

అందులోనే ఉంటూ హట్ టాపిక్
యాంకర్ శ్యామల కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడూ కొన్ని గ్లామరస్ పిక్స్‌ను వదులుతోంది. అలాగే, తన పర్సనల్ విషయాలను కూడా పంచుకుటోంది. ఫలితంగా తన ఫాలోవర్ల సంఖ్యను భారీగా పెంచుకుంటోంది.

శ్యామలకు నెటిజన్ వింత రిక్వెస్ట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ శ్యామల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకుంది. దీంతో ఆమె తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహించింది. ఇందులో చాలా మంది అడిగిన ప్రశ్నలకు సహనంతో సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ శ్యామలను మళ్లీ తల్లి కావాలంటూ ఊహించని రిక్వెస్ట్ చేశాడు.
Recommended Video

ఓరి దేవుడా అంటూ ఆమె రిప్లైతో
శ్యామల నిర్వహించిన చిట్ చాట్‌లో ఓ నెటిజన్ ‘ఇషాన్ (శ్యామల కొడుకు)కు ఒక సిస్టర్‌ను ఇవ్వండి. ఆడుకుంటాడు' అంటూ ఊహించని విధంగా రిక్వెస్ట్ చేశాడు. దీనికామె షాక్ అయిపోయింది. అంతేకాదు, ‘ఓరి దేవుడా' అంటూ ఫన్నీ ఎమోజీలతో జోవియల్‌గా రిప్లై ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











