అషు రెడ్డిని ‘లేచిపోదామా’ అని అడిగిన కుర్రాడు: ఊహించని రిప్లైతో షాకిచ్చిన బ్యూటీ
ఆకట్టుకునే అందం.. మెస్మరైజ్ చేసే అభినయం.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తోంది బబ్లీ బ్యూటీ అషు రెడ్డి. అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఈ లేడీ.. దాదాపు ఐదేళ్లుగా రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎనలేని ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్ నిర్వహించింది. ఇందులో ఈ బ్యూటీని ఒకరు లేచిపోదామా అని అడిగారు. దానికి ఊహించని రిప్లై ఇచ్చింది. ఆ వివరాలు మీరు కూడా చూసేయండి మరి!

జూనియర్ సమంతగా గుర్తింపు
చాలా కాలం క్రితం డబ్‌స్మాష్ వీడియోల ప్రభావం దేశ వ్యాప్తంగా కనిపించేది. దీని ద్వారా ఎంతో మంది పాపులర్ అయిపోయారు. అందులో అషు రెడ్డి కూడా ఒకరు. చూడ్డానికి అచ్చం సమంతలా కనిపించే ఆమెకు లక్షల్లో ఫాలోవర్లు వచ్చారు. దీంతో ఈ భామ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ' అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా మూవీలు చేయలేదు.

బిగ్ బాస్ మొత్తం మార్చిందిగా
నితిన్ సినిమాలో నటించిన తర్వాత అషు రెడ్డి విదేశాలకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఆమె పెద్దగా కనిపించలేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉండేది. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. అయితే, గతంలో కంటే బొద్దుగా మారింది. దీని వెనుక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

లవ్ ట్రాకులు.. మరింత ఫేమ్
అషు రెడ్డి కొంత కాలంగా తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు కనిపించిన ఈ బ్యూటీ.. అతడితో డేట్‌కు వెళ్లడం పార్టీలు చేసుకోవడం వంటివి చేసేది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్వాట కొనసాగిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అతడికి ఓ కాస్ట్లీ బైక్‌ను కూడా కొనిచ్చి డౌట్లు పెంచేసింది.

అలా సందడి.. రీఎంట్రీ ఇస్తూ
ఈ మధ్య కాలంలో అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ‘కామెడీ స్టార్స్' షోలో రచ్చ చేసింది. అదే సమయంలో ‘హ్యాపీ డేస్' అనే షోతో యాంకర్‌గానూ మారింది. ఇందులో ప్రస్తుతం యాంకర్ రవితో కలిసి సందడి చేస్తోంది. వీటితో పాటు అషు రెడ్డి స్పెషల్ ఈవెంట్లు, షోలలో కనిపిస్తోంది. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి రీఎంట్రీ కూడా ఇవ్వబోతుంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగానే
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్యను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.

లేచిపోదామా అని అడిగాడు
అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తూ సందడి చేస్తోంది. ఇక, తాజాగా బిగ్ బాస్ ఫేమ్ జస్వంత్ పడాలతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంది. ఇందులో చాలా మంది ఫాలోవర్లు రకరకాల ప్రశ్నలు అడిగారు. ఓ నెటిజన్ అషు రెడ్డిని ‘అషు.. మనం లేచిపోదాం' అంటూ కామెంట్ పెట్టాడు.
Recommended Video

అషు రెడ్డి ఊహించని ఆన్సర్
సదరు నెటిజన్ అడిగిన దానికి అషు రెడ్డి ఏం చెప్పాలో తెలియక తల పట్టుకుంది. ఆ తర్వాత ‘ఓకే చిల్' అంటూ ఊహించని విధంగా రిప్లై ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేచిపోదామన్న నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. హుందాగా ప్రవర్తించిన అషు రెడ్డిని చాలా మంది ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











