Bigg Boss 8 Telugu: అప్పుడు శోభా శెట్టి.. ఇప్పుడూ యష్మీ గౌడ..
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ నటి యష్మీ గౌడ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. గత సీజన్ లో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టిని అడియన్స్ ఏ రేంజ్ లో తిట్టుకున్నారో ఇప్పుడూ ఈ సీజన్ లో యష్మీ గౌడ కూడ ట్రోల్ చేస్తున్నారు. ఓ రకంగా చూస్తే.. యష్మీ కంటే శోభా బెటర్ అంటున్నారు. మీరు కూడా ఓ లూక్కేయండి.
గత సీజన్ లో సీరియల్ యాక్టర్ శోభాశెట్టి చెత్త బిహేవియర్తో.. అటు కంటెస్టెంట్లను.. ఇటు ప్రేక్షకులను చాలా ఇరిటేట్ చేసింది. ఆ సీజన్ లో టాప్ కంటెస్టెంట్ హీరో శివాజీ అయితే.. 'ఇలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉంటే.. పీక మీద కాలేసి తొక్కేసేవాడ్నినని' సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగా ఆ షోలో శోభ శెట్టి ప్రవర్తన చాలా చెత్తగా ఉండేది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఏంట్రా బాబూ ఈ దారుణం.. శివాజీ గారు మాటలతో సరిపెట్టారు గానీ.. మేమైతే నిజంగానే తొక్కేవాళ్లం అని ఓ రేంజ్ లో కామెంట్స్, ట్రోలింగ్ చేశారు. ఆమె ఎలిమినేట్ చేయండని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

మరో వైపు శోభాశెట్టి నామినేషన్స్‌లో ఉన్న ప్రతివారం బిగ్ బాస్ ప్రేక్షకుల పిచ్చోల్లా చూసేవారు. కానీ, ఆమెకు ఓట్లు పడకున్నా.. సేవ్ చూస్తూ వస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆమెకు బిబి లవర్స్ ఓట్లే వేయకపోవడంతో 14వ వారం కన్నడ కంత్రీ శోభాశెట్టిని ఎలిమినేట్ చేశారు. మొత్తానికి ఈ సీజన్‌లో పూర్తి నెగిటివిటీతో ఉన్న మంచి పేరుని చెడగొట్టుకుంది ఈ కన్నడ బ్యూటీ శోభాశెట్టి. నిజంగా తాను కార్తీకదీపంలో మోనితగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె. తాను రియల్ లైఫ్‌లో మోనిత కంటే యమ డేంజర్ అనే పేరు తెచ్చుకుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో అచ్చు శోభా శెట్టి తలపించే ఓ కంటెస్టెంట్ బీహెవ్ చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు.. యష్మీ గౌడ. నిజంగా అమ్మాయి కరెక్టర్ చాలా భిన్నంగా ఉంది. ప్రతి విషయంలో కూడా చాలా ఇరిటేటింగ్ వ్యవహరిస్తుంది. బిగ్ బాస్ నిన్ను ఛీప్ గా చేశాడు. కాబట్టి సేఫ్ అవుతున్నావ్. ఒక్క సారి నామినేషన్లలో అడుగుపెడితే.. అదే చివరి వారం అంటూ యష్మీ గౌడపై ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు.
బిస్ బాస్ తెలుగు రివ్యూవర్స్ కూడా ఇదే మాట అంటున్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచే యష్మీ గౌడ ప్రవర్తన, ఆమె ఆట తీరు జనాలకు నచ్చడం లేదనేదని చెప్పుతున్నారు. ఆమె వల్ల ఈ సీజన్ కు నెగిటీవీ పెరిగిందంటున్నారు. బీబీ హౌస్ లో చెత్త బీహెవియర్ అనీ, ఆమెకు ఓవర్ యాక్షన్ ఎక్కువ అని, బీబీ హౌస్ లో మిని సైజ్ నియంతగా వ్యవహరిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
టాస్కుల సమయంలో యష్మీ ప్రవర్తన చూసిన వారందరూ కచ్చితంగా షాక్ అవుతారు. ఆమె ఇష్టం వచ్చినట్టు కంటెస్టెంట్ల మీద అరవడం, అవసరం లేకున్న క్లాప్స్ కొట్టడం.. గుప్పి గంతులు వేయడం.. సైకోలా వ్యవహరించడం .. కంటెస్టెంట్లు కింద పడ్డా అయ్యో పాపం అనకుండా. అది గేమ్ అంటూ రూడ్ గా బీ హేవ్ చేయడంతో షాకవుతున్నారు నెటిజన్స్.
ఈ తరుణంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. యష్మీ గౌడ గేమ్ వరస్డ్ కే వరస్ట్.. ఏమన్నా బీ హేవియారా..? ఎంటీ ఆ బీహెవియర్..? అసలూ.. ఏమి లేని దగ్గర డాన్సులు వేయడం? ఏమి లేని దగ్గర చప్పట్లు కొడుతుంది. అంటే.. తనదే నెగ్గాలి. అవతలి వాడు టాస్కులు ఆడుతూ చనిపోయిన నవ్వేలా ఉంది. నిజంగా ఆమె చూపించే బీహెవియర్ అంత దారుణంగా ఉంది. ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
గత సీజన్ లో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టిని అడియన్స్ ఏ రేంజ్ లో తిట్టుకున్నారో తెలిసిందే. ఇరిటేటింగ్ బిహేవియర్ అంటూ శోభా శెట్టిపై భారీగా నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సీజన్ లో యష్మీ గౌడ కంటే శోభా బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు తొలి రోజు నుంచే యష్మీని శోభాతో పోలుస్తున్నారు. ఈ రెండో వారం ఆమె ఆట తీరు చూశాక.. యష్మీ కంటే శోభా శెట్టి వెయ్యి రెట్లు బెటర్ అంటున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











