Ariana Glory అరియానా బోల్డ్ వీడియో..నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్!
బిగ్ బాస్ బ్యూటీ అరియనా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఓ బోల్డ్ వీడియోను షేర్ చేయగా అది కూడా విప్పేస్తే అయిపోతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నెటిజెన్లు సెటైర్లు వేసేలా అరియానా ఎలాంటి డ్రెస్ ధరించిందో మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
కొంతమంది సెలబ్రిటీలు సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియా ద్వారానే విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంటారు. అలాంటి వారి లిస్ట్ లో అరియానా కూడా ఉంటుంది. ఒకప్పుడు సాదాసీదా యాంకర్ గా ఉన్న ఆమె ఆర్జీవితో ఇంటర్వ్యూ తర్వాత విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుని సెలబ్రిటీ స్టేటస్ ను అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టి మరింతగా ప్రేక్షకులకు చేరువైంది.

అయితే ఆమె పాపులారిటీ పెరగడానికి మెయిన్ రీజన్ మాత్రం డైరెక్టర్ ఆర్జీవి అని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లక ముందు, బయటకు వచ్చాక కూడా వీళ్లిద్దరి వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. గతంలో ఆమె ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయగా, ఆయన అరియానా తొడల గురించి చేసిన సెక్సీ కామెంట్స్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.
దీంతో ఒక్కసారిగా అరియానా గురించి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఆమె ఎవరు అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇంకేముందీ ఫలితంగా సోషల్ మీడియాలో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్గ బాస్ బ్యూటీగా మారి పలు వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తోంది.
అయితే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆర్జీవితో కలిసి వర్కౌట్స్ చేస్తూ, ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవడం వంటివి చేసి మరోసారి సంచలనం సృష్టించింది. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ కు ఫుల్లుగా గ్లామర్ విందు వడ్డిస్తూ ఉంటుంది.
తాజాగా మరోసారి ఈ బ్యూటీ ఓ వీడియోలో కుర్రాళ్ళ కంటికి కునుకు కరువయ్యేలా ఈ సమ్మర్లో హాట్ హాట్ గ్లామర్ ట్రీట్ ఇచ్చి సెగలు పుట్టించింది. అయితే ఆ వీడియోలో అరియానా బ్యాక్ లెస్ టాప్, షార్ట్ స్కర్ట్ వేసుకుని బోల్డ్ లుక్ లో అదరగొట్టింది. స్లో మోషన్ లో ఉన్న ఆ వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది అరియానా.
దాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఈ బ్యూటీ అందానికి ఫిదా అయితే, మరి కొంతమంది మాత్రం ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ అది కూడా విప్పేస్తే అయిపోద్ది కదా అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అరియానా యాంకర్ గా, నటిగా తనకు వచ్చిన ఆఫర్లను ఉపయోగించుకుంటూ ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications











