యాంకర్ శ్యామలకు చేదు అనుభవం: రెండో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్.. ప్రెగ్నెంట్ అంటూ ఊహించని విధంగా!
టెలివిజన్ రంగంలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ప్రేక్షకుల నుంచి ప్రేమానురాగాలు లభిస్తుంటాయి. తెలుగులోనూ పదుల సంఖ్యలో యాంకర్లు రాగా.. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. అందులో శ్యామల ఒకరు. చాలా కాలంగా బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ బ్యూటీ.. హోమ్లీ లుక్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక, తాజాగా శ్యామలకు చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా ఒకరు రెండో పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

సీరియల్స్ నుంచి బుల్లితెర యాంకర్‌గా
శ్యామల యాంకర్‌గా పని చేయడానికి ముందే బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించింది. మరీ ముఖ్యంగా 'లయ', 'అభిషేకం' వంటి ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యాంకర్‌గా మారి 'మా ఊరి వంట', 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. వీటితో పాటు 'లౌక్యం', 'ఒక లైలా కోసం', 'గుండెల్లో గోదారి' సహా పలు సినిమాల్లో నటించింది.

యాక్టర్‌తో లవ్ ట్రాకు... అలా వివాహం
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే యాంకర్ శ్యామల.. బుల్లితెర నటుడు నరసింహాతో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో చాలా కాలం పాటు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ క్రమంలోనే తమ బంధం గురించి పెద్దలకు చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నారు. దీంతో 2007లో వీరిద్దరూ అగ్ని సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

బిగ్ బాస్‌లోకి రెండు సార్లు ఎంట్రీ ఇచ్చి
మూడేళ్ల క్రితం జరిగిన బిగ్ బాస్ రెండో సీజన్‌లో శ్యామల కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఏడాది బిడ్డ ఉన్నప్పటికీ.. కెరీర్ కోసం హౌస్‌లో అడుగు పెట్టింది. అయితే, అనుకోని విధంగా ఆమె షో మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, ప్రేక్షకుల ఓట్లతో ఆ వెంటనే మరోసారి షోలోకి అడుగు పెట్టింది. అయినప్పటికీ ఆమె ఫినాలేకు కూడా చేరుకోలేకపోయింది. అయితేనే ఫేమస్ అయింది.

పాలిటిక్స్‌లోకి ఎంట్రీ.. జగన్ గెలుపులో
బిగ్ బాస్ షోలో గెలవకున్నా పేరు మాత్రం బాగానే సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో 2019 ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు భర్తతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎన్నికల సమయంలో వీళ్లిద్దరూ కలిసి ఆ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించారు. తద్వారా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గెలుపులో భాగం అయ్యారు.

వాళ్లిద్దరితో భేటీ.. తెలంగాణలో హైలైట్
గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన యాంకర్ శ్యామల.. కొన్ని రోజులుగా తెలంగాణ పాలిటిక్స్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పెట్టబోతున్న పార్టీలో ఆమె చేరబోతుందన్న వార్తలే. కొద్ది రోజుల క్రితం శ్యామల తన భర్తతో కలిసి బ్రదర్ అనిల్‌తో పాటు షర్మిలతోనూ భేటీ అవడంతో ఈ పుకార్లు వచ్చాయి.

వివాహం చేసుకోమని ఆమెకు రిక్వెస్ట్
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది శ్యామల. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'శ్యామల గారూ ఐ లవ్ యూ. నన్న పెళ్లి చేసుకోండి' అంటూ అడిగాడు. దీనికి షాక్ అయిన ఆమె.. ఆశ్చర్యంతో చూస్తున్న ఓ జిఫ్ ఫైల్‌ను పోస్ట్ చేసింది.

ప్రెగ్నెంట్ అంటూ ఊహించని విధంగా
ఇదే సెషన్‌లో శ్యామలను ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు నెటిజన్లు. మీరు ఆ చీర కట్టుకోండి.. ఈ చీర కట్టుకోండి.. ఏం తింటారు? ఎలా ఉంటారు? ఇలా సవా లక్ష ప్రశ్నలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇదే సమయంలో ఓ నెటిజన్ 'అక్కా.. మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉన్నారా' అని ప్రశ్నను సంధించారు. దీనికి తలను అడ్డంగా ఊపే ఓ జిఫ్ ఫైల్‌ను సమాధానంగా చెప్పింది శ్యామల.


Click it and Unblock the Notifications











