బిగ్‌బాస్‌పై విష్ణుప్రియ ఫ్లేట్ ఫిరాయింపు.. యాంకర్‌ను ట్రోల్స్‌తో ఆడేసుకొంటున్న నెటిజన్లు!
అందంతోపాటు అభినయంతో యాంకర్‌గా యాక్టర్‌గా ఆకట్టుకొన్న విష్ణు ప్రియ భీమినేని తాజాగా అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్‌బాస్ స్టేజ్‌పై తనదైన శైలిలో డ్యాన్సులు, స్టెప్పులతో హోరెత్తించారు. అయితే గతంలో బిగ్‌బాస్ తెలుగు షోపై ఆమె అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే?
తెలుగు వినోద పరిశ్రమలో యాక్టర్, యాంకర్ విష్ణుప్రియ భీమినేని బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. జంటగా ఇంటిలోకి వెళ్లే కాన్సెప్ట్‌తో ఆమె పృథ్వీ అనే కంటెస్టెంట్‌తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నాగ్ వేసిన చిలిపి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయింది. నాకు ఐక్యూ తక్కువ అంటూ కామెంట్ చేసింది.

బిగ్‌బాస్ తెలుగు షోలోకి వెళ్తున్నారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. బయట ప్రపంచమంతా అందంగా ఉన్నప్పుడు ఓ ఇంటిలో కొన్నాళ్లు ఎందుకు ఉండాలి? మీరే చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇంట్లో వాళ్లు ఉన్నారు. వారిని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను బిగ్‌బాస్ షోకు సరిపడని సెలబ్రిటీని అంటూ ఆమే పెద్ద ఉపన్యాసం ఇచ్చారు.
బిగ్ బాస్ షో అంటే నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నేను చూడలేదు. వ్యక్తిగతంగా నన్ను అడిగితే.. అలాంటి షోను ఎంకరేజ్ చేయను. మీరు రాసిపెట్టుకొండి.. వాళ్లు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్లనంటే వెళ్లను అని విష్ణు ప్రియ తనదైన శైలిలో మీడియాతో తన అభిప్రాయాలను పంచుకొన్నది.

ఇక కట్ చేస్తే.. బిగ్‌బాస్ తెలుగు 8 షోలోకి ఈ అందాల భామ ఎంట్రీ ఇచ్చారు. దాంతో పాత వీడియోను నెటిజన్లు షేర్ చేసి.. ఏంటి? ఈ అమ్మ ఇంత సులభంగా ఫ్లేట్ ఫిరాయించిందేమిటి అంటూ ముక్కున వేలేసుకొంటున్నారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అయితే తొలి రోజే విష్ణుప్రియకు ఇలా డ్యామేజ్ జరగుతుండటంతో ఆమె వర్గీయులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టే ప్రయత్న్ం చేశారు. ఇది 2019 సంవత్సరానికి ముందు వీడియో.. అప్పుడు వాళ్ల మదర్‌కు బాగాలేకపోవడం వల్ల అలా చెప్పింది. ఇటీవలే వాళ్త తల్లి మరణించారు. అందుకే ఆ షోలోకి వెళ్లింది అంటూ వివరణ ఇచ్చారు. అయితే కొందరు అభిమానులు మాత్రం బిగ్‌బాస్ షో చూస్తే.. ఆమె కోసమే చూడాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











