నోయల్‌ను దూరం చేసి.. దివిని దగ్గరగా తీసుకుని: నాగార్జున తీరుపై నెటిజన్ల ఆగ్రహం.!
సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకుని దాదాపు ముప్పై ఏళ్లుగా స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. సినీ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకున్న ఆయన... కొన్నేళ్ల క్రితం 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే షోతో బుల్లితెరపైకీ హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇక, బిగ్ బాస్ షోనూ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తూ సత్తా చాటుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు కంటెస్టెంట్లతో నాగ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఆ వివరాలు మీకోసం.!

నాగార్జున... బుల్లితెరపై ట్రెండ్ సెట్టర్
వైవిధ్యమైన పాత్రలతో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులను సైతం అందుకున్నాడు. ఇక, బుల్లితెరపై హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన అదే దూకుడు చూపిస్తున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు', ‘బిగ్ బాస్' షోలు సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పలు రికార్డులతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.

కుర్ర హీరోలకు ధీటుగా.. అన్నీ హిట్టే
తెలుగులో బిగ్ బాస్ షోను మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. ఆ తర్వాతి సీజన్‌ను నేచురల్ స్టార్ నాని నడిపించాడు. మూడో దానిని అక్కినేని నాగార్జున హోస్ట్ చేసి, నాలుగో సీజన్‌కు సైతం కంటిన్యూ అవుతున్నారు. గతంలో తారక్, నాని ఎన్నో రికార్డులు క్రియేట్ చేయగా.. నాగార్జున వాటన్నింటినీ బద్దలు కొట్టడంతో పాటు సరికొత్త చరిత్రను సృష్టించి సత్తా చాటాడు.

బిగ్ బాస్‌కు దూరం.. సమంత ఎంట్రీ
బిగ్ బాస్ సీజన్ 4 ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హోస్ట్ అక్కినేని నాగార్జున షో నుంచి తప్పుకున్నారు. తన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్' కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జున తప్పుకున్న ఎపిసోడ్‌కు అక్కినేని సమంత హోస్టింగ్ చేసింది. మామ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరోయిన్ తనదైన శైలి హోస్టింగ్‌తో ప్రేక్షకులను, కంటెస్టెంట్లను ఆకట్టుకుంది.

రిచ్‌గా రీఎంట్రీ.. కంటెస్టెంట్లకు గిఫ్టులు
సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వైల్డ్ డాగ్' మూవీ కోసం నాగార్జున కులుమనాలీకి వెళ్లారు. అక్కడ 21 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. అయితే, ఈ వారం బిగ్ బాస్ షో కోసం ఆయన ప్రత్యేక హెలీకాఫ్టర్, విమానాల్లో ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే షోలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడంతో పాటు కంటెస్టెంట్లకు కొన్ని కానుకలు అందించారు.
నాగార్జున తీరుపై నెటిజన్ల ఆగ్రహం.!
స్టార్ హీరోనే అయినా నాగార్జున అందరితో ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలోనూ ఆయన అదే కంటిన్యూ చేస్తున్నారు. మూడో సీజన్‌తో పాటు ప్రస్తుత సీజన్‌లోనూ కంటెస్టెంట్లు అందరికీ బాగా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే వాళ్లందరితో హోస్ట్‌లా కాకుండా ఫ్రెండ్‌లా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ఓ పని వివాదాస్పదం అవుతోంది.
Recommended Video

నోయల్‌ను దూరం చేసి.. దివిని దగ్గరగా
శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన నోయల్‌తో నాగార్జున దూరంగా జరిగి మాట్లాడారు. ‘ఎక్కడెక్కడో తిరిగి వచ్చాను కదా.. దూరం పాటిద్దాం' అని చెప్పుకొచ్చాడాయన. అయితే, అంతకుముందు దివితో మాత్రం నాగ్ క్లోజ్‌గా ఉండి ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ రెండు ఫొటోలను ఉద్దేశిస్తూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు కొందరు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











