శ్రీముఖికి చుక్కలు చూపిస్తున్నారు.. మరీ ఇంత దారుణంగానా.. చూస్తే షాకైపోతారు

Recommended Video

Bigg Boss Telugu 3 : Netizens Trolls On Sreemukhi || Filmibeat Telugu

ఒకవైపు వివాదాలు.. మరోవైపు కేసులు నడుస్తున్నా.. ఈ షోను నిషేదించాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరిగిపోతున్నప్పటికీ 'బిగ్ బాస్' తెలుగు సీజన్ - 3 మొదలైంది. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కంటెస్టెంట్లను వీక్షకులకు పరిచయం చేసిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. వాళ్లందరినీ హౌస్‌లోకి పంపించారు.

 నాగ్‌కు మొదటి టాస్క్

నాగ్‌కు మొదటి టాస్క్

‘బిగ్ బాస్' నాగార్జునను ముగ్గురు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేయమని చెప్పాడు. ఆ ముగ్గురినే ఫస్ట్ హౌస్‌లోకి పంపించమని ఆదేశించాడు. దీంతో నాగ్.. ‘ఫస్ట్ టాస్క్ నాకే ఇచ్చారా బిగ్ బాస్' అనుకుంటూ బయటకు వచ్చాడు. అంతేకాదు, బాస్ చెప్పినట్లు ముగ్గురిని చిటీల ద్వారా ఎంపిక చేసి, వాళ్లను లోపలికి పంపించాడు.

మొదటి రోజే నామినేషన్

మొదటి రోజే నామినేషన్

లోపలికి వెళ్లగానే ముగ్గురు కంటెస్టెంట్‌లకు ‘బిగ్ బాస్' టాస్క్ ఇచ్చారు. ఇకపై వచ్చే కంటెస్టెంట్లను కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పారు. ఆ తర్వాత వాటి ఆధారంగానే మంచిగా ఆన్సర్స్ చెప్పని ఆరుగురిని ఎంపిక చేయమన్నాడు. వాళ్లు చెప్పిన ఆరుగురు సభ్యులను ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ చేశాడు. ఆ తర్వాత మానిటర్‌ను ఎన్నుకుని తప్పించుకోవచ్చు అని ఒక రూల్ పెట్టాడు.

మానిటర్ ఎంపిక

మానిటర్ ఎంపిక

మిగిలిన సభ్యుల నుంచి నటి హేమను మానిటర్‌గా ఎంపిక చేశారు. దీంతో బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. ఆ తర్వాత ఆమెకు ఓ లెటర్ ఇచ్చి చదివించాడు. నామినేట్ అయిన ఆరుగురిలో ఎవరినైనా మార్చే అధికారం మానిటర్‌కు ఉందని, అయితే.. ఆమెను మెప్పించేలా వాళ్లు ప్రవర్తించాల్సి ఉంటుందని కండీషన్ పెట్టాడు. దీంతో మొదటి రోజు ముగిసింది.

శ్రీముఖి గ్లామర్ షో

నామినేషన్.. ఎలిమినేషన్.. ఇవన్నీ పక్కనపెడితే.. ఈ షో ప్రారంభమైన మొదటి రోజే ప్రముఖ యాంకర్ శ్రీముఖి గ్లామర్ షో వీక్షకులను ఆకట్టుకుంది. చిన్న షార్ట్ ధరించి ఆమె బయటకు రాగానే అంతా నోరెళ్లబెట్టేశారు. వచ్చీ రాగానే ఆమె డ్యాన్స్‌తో మెరిపించింది. దీంతో శ్రీముఖి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

అదే సమయంలో ట్రోల్స్ కూడా..

అదే సమయంలో ట్రోల్స్ కూడా..

శ్రీముఖికి బయట ఎంత పాపులారిటీ ఉందో అంతే వ్యతిరేకత ఉంది. అందుకే ఆమెను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నిక్కరు విషయంలో ఎవరూ ఏమీ అనకపోయినా.. శ్రీముఖి వాయిస్‌ను మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతి దానికి లౌడ్ స్పీకర్‌ సౌండ్ వచ్చేలా మాట్లాడుతుండడంతో పలువురు ఆమెపై మీమ్స్ క్రియేట్ చేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X