సీఎంపై పోస్ట్.. తప్పులో కాలేసిన బ్రహ్మముడి కావ్య, ఏకీపారేస్తోన్న నెటిజన్లు

తెలుగులో ప్రసారమవుతున్న టాప్ సీరియల్స్‌లో స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి కూడా ఒకటి. ఈ ధారావాహికలో కావ్యగా లీడ్ రోల్ పోషిస్తున్నారు తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దుమ్మేత్తిపోస్తున్నారు. ఆమె ఏం చేసింది? నెటిజన్లు అంతగా ఎందుకు మండిపడుతున్నారు? అనేది పరిశీలిస్తే :

తమిళనాడుకు చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. చదువు ముగిసిన తర్వాత ఓ న్యూస్ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించిన దీపికకు చిత్రరమ్ పెసుతాడి అనే సీరియల్‌లో అవకాశం వచ్చింది. ఇందులో నటనతో కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు దీపిక. ఇక ఫుల్ టైం నటిగా స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమెకు బ్రహ్మముడిలో అవకాశం దక్కింది.

netizens trolled brahmamudi fame deepika Rangaraju over her post on Chief Minister

అమాయకత్వం, నిజాయితీ, ఓర్పుతో కూడిన కావ్య అనే ఇల్లాలి పాత్రలో దీపిక రంగరాజు ఒదిగిపోయారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా దానిని పరిష్కరించి సమస్య నుంచి గట్టెక్కించే బరువైన పాత్రను పోషించారు దీపిక. మెట్టినింటికీ, పుట్టింటికీ మధ్య వారధిగా వ్యవహరిస్తూ జీవించేస్తున్నారు దీపిక. ఇందులో హీరోగా ఉన్న మానస్ నాగులపల్లితో ఆమె కెమెస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సీరియల్‌తో పాటు బయట కూడా ఈ జంట హల్ చల్ చేస్తుంటుంది. బుల్లి తెరపై ప్రసారమయ్యే స్పెషల్ షోలు, ఈవెంట్స్‌లో దీపిక సందడి అంతా ఇంతా కాదు. కొద్దినెలల క్రితం ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 8లోనూ హౌస్‌లోకి వెళ్లి నానా రచ్చ చేసింది.

30కి చేరువైన ఈ ముద్దుగుమ్మ పెళ్లెప్పుడు చేసుకుంటుంది అంటూ నెటిజన్లు , ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటారు. అయితే అందరు సెలబ్రెటీల మాదిరిగానే దీపిక మీద పలు గాసిప్స్ వెల్లువెత్తాయి. అయితే ఓ సీరియల్ నటుడితో ఈమె పీకల్లోతు ప్రేమాయణం నడుపుతోందని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని పుకార్లు షికారు చేశాయి. అయితే తర్వాత అవన్నీ గాలివార్తలేనని తేలిపోయింది.

బ్రహ్మముడిలో పద్ధతిగా, క్యూట్‌గా కనిపించే దీపిక రంగరాజు బయట చాలా అల్లరి పిల్ల. సెట్‌లో అడుగుపెట్టిందంటే చాలు రచ్చరచ్చే. నవ్వుతూ నవ్విస్తూ ఎలాంటి సీరియస్ వాతావరణాన్ని అయినా సరే ఆహ్లాదకరంగా మార్చేయడంలో ఆమె దిట్ట. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే దీపిక రంగరాజు ఎప్పటికప్పుడు తన సినిమాలు, సీరియల్స్, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పెట్టిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో బోటులో స్టీరింగ్ తిప్పుతూ తాను చీఫ్ మినిస్టర్‌ను కలవడానికి వెళ్తున్నానని పోస్ట్ పెట్టింది. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అందులో చీఫ్ మినిస్టర్ స్పెల్లింగ్ తప్పుగా ఉండటంతో ముందు స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయడం నేర్చుకో అంటూ నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.

More from Filmibeat

Read more about: brahmamudi deepika rangaraju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X