For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హైపర్ ఆది యాక్సిడెంట్.. సుధీర్ పేరు లాగుతూ దారుణంగా ఆడుకుంటున్న నెటిజన్లు!

  |

  జబర్దస్త్ ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అతి కొద్దికాలంలోనే తనదైన పంచ్ పవర్ తో టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇప్పుడు సుధీర్ లేకపోతే హైపర్ ఆది కూడా ఏమీ చేయలేక పోతున్నాడు అంటూ ఆది మీద విమర్శల వర్షం కురుస్తోంది. అసలు ఎందుకిలా అవుతోంది? సుదీర్ లేకపోతే హైపర్ ఆది ఎందుకు ఏమీ చేయలేక పోతున్నాడు? అనే వివరాల్లోకి వెళితే

  టిఆర్పి తెచ్చుకునే ప్రయత్నం

  టిఆర్పి తెచ్చుకునే ప్రయత్నం

  సుడిగాలి సుధీర్ ప్రస్తుతం మల్లెమాలకు సంబంధించిన ఏ ప్రోగ్రాంలో కూడా కనిపించడం లేదు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఒక సింగింగ్ రియాల్టీ షోకి ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్న క్రమంలో మల్లెమాల సంస్థ నుంచి పూర్తి స్థాయిలో తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  సుధీర్ లేకపోయినా సుధీర్ పేరుతో చేసే కామెడీతో కాస్త నెట్టుకొస్తున్నారు కానీ గత రెండు ఎపిసోడ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ వ్యవహారం చూస్తే మాత్రం సుధీర్ లేకపోతే టిఆర్పి లేదని అందుకే ఏదో ఒక వింత ప్రయత్నం చేసి టిఆర్పి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

  హైపర్ ఆదిని అరెస్టు చేసి

  హైపర్ ఆదిని అరెస్టు చేసి

  మొదటివారం హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ ఉండగా ఇమ్మానియేల్ ఆమె మీద చేయి వేసి మాట్లాడుతూ ఉండడంతో ఆమె సీరియస్ అయి రచ్చ చేసినట్టు ప్రోమోలో చూపించారు. తర్వాత ప్రోగ్రాంలో అసలు అంత ఏమీ జరగలేదని క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమో కూడా హైపర్ ఆది అరెస్టయ్యాడు అంటూ వార్తలు రావడానికి కారణమైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ షో జరుగుతుండగానే పోలీసులు వచ్చి హైపర్ ఆదిని అరెస్టు చేసి తీసుకు వెళుతున్నట్లు ప్రోమోలో చూపించారు.

  రూపాయి ఇస్తే

  రూపాయి ఇస్తే

  ఇక పోలీసులు రావడం ఆదిని అరెస్ట్ చేయడానికి ఒక కారణం కూడా చెప్పడం జరిగింది. అదేమిటి అంటే హైపర్ ఆది ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేయడంతో ఆ వ్యక్తి చావు బతుకుల మధ్య ఉన్నాడని పోలీసులు చెబుతూ హైపర్ ఆది ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇదే విషయం మీద నెటిజన్లు మండిపడుతున్నారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పోలీస్ అన్నకి రూపాయి ఇస్తే పది రూపాయల కామెడీ చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  స్థాయి దిగజార్చుకుంటున్నారు

  స్థాయి దిగజార్చుకుంటున్నారు

  అంతే కాక ఎందుకు ఇలాంటి అనవసరపు ప్రాంక్స్ తో మీ స్థాయి దిగజార్చుకుంటున్నారు అంటూ మల్లెమాల సంస్థను ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో 1,2 ఇంటర్వ్యూలలో తనకు కారు కానీ బైక్ గాని ఏది నడపడం రాదు అని ఆది చెప్పుకొచ్చాడు. అసలు డ్రైవింగ్ రాని ఆది, డ్రైవింగ్ చేస్తూ రావడం వస్తూ వస్తూ ఎవరినో గుద్దడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలా ఒక వ్యక్తిని గుద్ధి వెళ్ళిపోతే ఇలా పోలీసులు వెంటపడి రావడం ఇది కరెక్ట్ గా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

  బకరా చేయడానికి

  బకరా చేయడానికి

  సుధీర్ లేకపోతే టీఆర్పీ రావడం లేదు కదా అని ఇలాంటి రచ్చ చేయడం ఏమాత్రం బాలేదు అని అంటున్నారు. అంతే కాదు అక్కడ ఏమీ జరగదు టీఆర్పీ కోసమే ఇలాంటివి చేస్తారు, ఎందుకు ఇలా చేస్తున్నారు కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా ఎందుకు పదేపదే జనాన్ని బకరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సుధీర్ అన్న లేకపోతే దానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలి కానీ ఇలా ఎన్ని రోజులు ప్రాంక్స్ చేసి షో నెట్టుకొస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

  English summary
  netizens trolling hyper aadi accident and arrest in sridevi drama company promo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X