Bigg Boss Telugu 7: ఇదేందయ్యా బిగ్ బాసూ... నీకు నచ్చింది చేసుకోవడానికి ఓటింగ్ ఎందుకు?
బిగ్ బాస్ తెలుగు 7 మరో రెండు వారాల్లో ముగియనుంది. ఇక ఈ షోలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉన్నారు. అందులో ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ కానున్నారు. ఈ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్, ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. ప్రతి సారి ఈ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ ఏంటి బిగ్ బాసూ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ ఈ మాత్రం దానికి ఓటింగ్ ఎందుకు అంటూ ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న అట్టహాసంగా ప్రారంభం అయి.. 13 వారాలుగా కొనసాగుతూ వస్తుంది. ఇక ఈ వారం ఒక్క అమర్ దీప్ తప్ప అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ అయ్యింది మాత్రం గౌతమ్ కృష్ణ. దీనిపై నెటిజన్స్, బిగ్ బాస్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. ఇది అన్ ఫెయిన్ ఎలిమినే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గౌతమ్ విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు.

దానికి కారణం గౌతమ్.. ఓటింగ్ లో బాగానే ఓట్లు వచ్చినప్పటికీ ఈ వారం ఎలిమినేట్ అవ్వడం షాకింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ వారం ఓటింగ్ చూసుకుంటే.. శివాజీ, ప్రశాంత్, అర్జున్ టాప్ లో ఉండగా.. యావర్, గౌతమ్, ప్రియాంక, శోభా శెట్టి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే లెక్క ప్రకారం ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావాలి కానీ.. ఆమెను సేవ్ చేసి గౌతమ్ ను ఎలిమినేట్ చేశారు. దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
బిగ్ బాస్ నీకు నచ్చిన వారిని ఎలిమినేట్ చేసుకోవడానికి ఎందుకు ఓటింగ్, పోలింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి వారం పోలింగ్ పెట్టడం దేనికి.. ఓటు వేయండి అని అడగటం దేనికి.. చివరకు నీకు నచ్చిన వ్యక్తిని సేవ్ చేయడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి సారి నీకు నచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తావ్... కాపాడుకుంటావ్ అంటూ ఫైర్ అవుతున్నారు.
బిగ్ బాస్ నిజంగానే.. శోభా శెట్టిని, రతికా రోజ్ ను కాపాడుకునేందుకు చాలా మందిని బలిచేశాడు. ఇప్పుడు మరో కంటెస్టెంట్ గౌతమ్ బలి అయ్యాడు. ఇక శివాజీ విషయంలోనూ బిగ్ బాస్ ఫేవర్ గా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు శివాజీని విన్నర్ చేసేందుకు బిగ్ బాస ప్లాన్ చేస్తున్నట్లు అనుకుంటుకున్నారు.
ఇది అన్ ఫెయిర్ బిగ్ బాస్... ఇలా చేయడం కరెక్ట్ కాదు.. అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్స్. ఇక ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ కానున్నారు. ఇక హౌస్ లో 7 మంది ఉంటారు. వారిలో అర్జున్ అంబటి ఫస్ట్ ఫైనాలిస్ట్ అయ్యాడు. ఇక టాప్ 5 లిస్టులో అర్జున్ అంబటి, ప్రియాంక, అమర్ దీప్, ప్రశాంత్, శివాజీ ఉండనున్నారు. ఇక విన్నర్ మాత్రం ప్రశాంత్, శివాజీ, అమర్ లలో ఒకరు కానున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











