చెప్పేవీ నీతులు? చేసేవి అలాంటి పనులా? అనసూయపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోలింగ్

తెలుగు బుల్లితెర టాప్ యాంకర్ అలాగే సినీ పరిశ్రమలో కూడా మంచి పేరు తెచ్చుకున్న నటి అనసూయ భరద్వాజ్ మరోసారి చాలా కాలం తర్వాత సినిమాలు కాకుండా కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా మారుతుంది. అందరికీ నీతులు చెప్పే అనసూయ తన గతాన్ని కూడా చూసుకోవాలి కదా అని కొందరు అంటున్నారు. కాగా అనసూయ తనేం చెప్పినా అదే కరెక్ట్ మిగతా అంతా తప్పు అనే లెవెల్లో ప్రవర్తిస్తుంది అని రియల్ వరల్డ్ కి దూరంగా తన ప్రపంచంలోనే నిత్యం గడుపుతుంది అన్నట్టుగా తనపై నెగిటివ్ కామెంట్స్ సినిమాల్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.

కాగా ఇప్పుడు తాజాగా మరోసారి యువ హీరో విజయ్ దేవరకొండతో కాంట్రవర్సీ విషయంలో సినీ వర్గాల్లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. పై పెచ్చు సోషల్ మీడియాలో మరిన్ని కామెంట్స్ చేయడం ఒక్క విజయ్ ఫ్యాన్స్ లోనే కాకుండా ఆమె ఆలోచనలతో సెట్ కాని నెటిజన్స్ లో కూడా చర్చకి దారి తీసింది. కాగా అనసూయ ఇప్పుడు ఇన్ని నీతులు చెబుతుంది కానీ ఆమె చేసిన నిర్వాకాలు కూడా చూడాలి అంటూ నెటిజన్స్ ఆమె పాత షోలు సినిమాలు విషయంలో అన్నీ బయటకి తవ్వుతున్నారు.

netizens trolls and Slams Anasuya Bharadwaj with her old videos

అయితే అనసూయ చేసిన పలు షోస్ లో తన గ్లామర్ డోస్ ని కూడా జోడించి మంచి ఫేమస్ అయ్యిన సంగతి అందరికీ తెలుసు. అలాగే పలు ఎంటెర్టైనింగ్ షోస్ లో భాగంగా చిన్న పిల్లలతో కూడా కొన్ని షోస్ యాంకర్ గా చేసింది. మరి అలా చేసిన ఓ షో ఎపిసోడ్ పై షాకింగ్ వీడియో నెటిజన్స్ డిగ్ చేశారు. ఇందులో అనసూయ ఓ చిన్న పిల్లాడితో సుమారు ఆరేడు సంవత్సరాల వయస్సు ఉండొచ్చు ఆ పిల్లాడితో ఇక్కడ ముద్దు పెట్టు అక్కడ ముద్దు పెట్టు అంటూ పెదాలపై కూడా ముద్దు పెట్టించుకుంది.

అయితే ఇలాంటి షోస్ మూలాన అంత చిన్న పసి వయసు ఉన్న బుర్రల్లో ఎలాంటి కామ ఆలోచనలు నాటుతున్నారు అన్నట్టుగా ఓ సినిమాలో సెటైర్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఆ సినిమానే "హాట్ స్పాట్". తమిళ్ లో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో డబ్ అయ్యి ఆహాలో వచ్చింది. ఈ ఆంథాలజీ చిత్రంలో చివరి కథగా చిన్న పిల్లల కోసమే ఉంటుంది.

ఇందులో ఓ సీన్ అనసూయ షోని ఉద్దేశించే పెట్టినట్టుగా ఉన్నారని చెప్పాలి. ఒక 30 ఏళ్ళు ఉన్న ఆమె చిన్న పిల్లాడిని నువ్వే నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ ముద్దు పెట్టు అక్కడ ముద్దు పెట్టు అని బూతు షోలు చేస్తుంటే అవి చూసి వెకిలి నవ్వు నవ్వుతున్నారు కానీ అది తప్పు అని ఎవరూ చెప్పడం లేదు అంటూ డైలాగ్ ఉంటుంది.

మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రీ మీట్ లలో అన్ని నీతులు చెబుతున్న అనసూయ ఇలాంటి షోస్ చేసి ఇక్కడ వరకు వచ్చింది మరి ఈమె సమాజానికి ఏం చెబుతున్నట్టు అంటూ ఆమెపై మరిన్ని విమర్శలు కురిపిస్తున్నారు. మరి వీటిపై అనసూయ ఏమన్నా సమాధానం చెబుతుందో లేక "రంగస్థలం" సినిమా టైం లో వచ్చిన కాంట్రవర్సీకి సైలెంట్ గా ఉన్నట్టు ఉండిపోతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X