Ashu Reddy: అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్.. అది తీసేసి చూపించు అంటూ దారుణంగా!

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఆంధ్రా, తెలంగాణ నుంచి ఎంతో మంది అమ్మాయిలు విశేషమైన గుర్తింపును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెరపైనో తళుక్కున మెరుస్తూ ఫుల్ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో చాలా ఏళ్ల క్రితమే జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి ఒకరు. అప్పట్లోనే కొన్ని లక్షల మంది అభిమానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో మరింత పాపులర్ అయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సైతం అందుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అషు రెడ్డి ఓ వీడియో వదలగా.. దానిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

 డబ్‌స్మాష్‌తో ఫుల్ పాపులారిటీ

డబ్‌స్మాష్‌తో ఫుల్ పాపులారిటీ


డబ్‌స్మాష్ వీడియోలో దేశ వ్యాప్తంగా ఎంత ప్రభావాన్ని చూపించాయో అందిరికీ తెలిసిందే. వీటి వల్ల ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. అందులో అషు రెడ్డి ఒకరు. చూడ్డానికి అచ్చం సమంతలా ఉండడంతో ఈమెకు ఫాలోయింగ్ పెరిగింది. దీంతో అషుకు నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ' అనే మూవీలో అవకాశం వచ్చింది. దీంతో మరింతగా ఫేమస్ అయిపోయింది.

బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి

బిగ్ బాస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి


అషు రెడ్డి గతంలో జరిగిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా సందడి చేసింది. అందులో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా.. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే ఈ బ్యూటీ అందరి దృష్టినీ ఆకర్షించి.. తన క్రేజ్‌ను భారీగా పెంచుకుంది.

 బోల్డుగా ఉంటూ.. బూతులతో

బోల్డుగా ఉంటూ.. బూతులతో


మామూలుగానే అషు రెడ్డి ఎంతో బోల్డుగా కనిపిస్తుంటుంది. అలాంటిది 24 గంటల పాటు సెన్సార్ లేకుండా రన్ అవుతోన్న బిగ్ బాస్‌లో ఆమె ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే నాన్ స్టాప్ సీజన్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి హైలైట్‌గా నిలిచింది.

 టాప్ 7లో లేకపోవడంతో షాక్

టాప్ 7లో లేకపోవడంతో షాక్


బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అషు రెడ్డి తన మార్కును చూపించింది. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ ఉండేలా వ్యవహరించింది. ఇలా చాలా రోజుల పాటు షోలో సందడి చేసింది. దీంతో ఆమె టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అనుకోకుండా ఫినాలేకు రెండు వారాల ముందే షో నుంచి ఎలిమినేట్ అవడంతో షాక్‌ తగిలినట్లైంది.

 అక్కడ మరింత యాక్టివ్‌గానే

అక్కడ మరింత యాక్టివ్‌గానే


సోషల్ మీడియాలో అషు రెడ్డి సుదీర్ఘ కాలంగా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరింతగా ఈ బ్యూటీ సందడి చేస్తోంది. దీంతో అషు రెడ్డిని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిందనే చెప్పుకోవాలి.

స్వయంవరం వీడియో షేర్

స్వయంవరం వీడియో షేర్

ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ సందడి చేసే అషు రెడ్డి.. తాజాగా బిగ్ బాస్ ఫేం అజయ్‌ కుమార్‌తో కలిసి ఓ రీల్ చేసింది. అందులో 'కాలం మారిపోయి పద్దతులు మారిపోయాయి కానీ... నాకే కనుక స్వయంవరం పెడితే.. ఎంత మంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చే వాళ్లో తెలుసా' అని అనుష్క చెప్పిన డైలాగ్‌కు పెదాలు కదిపింది. దీంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

 అది కూడా తీసేసి చూపించు

అది కూడా తీసేసి చూపించు


అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు నెటిజన్ల నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు 'నీకోసం గుర్రాలు వేసుకుని కదా.. చీపుర్లు పట్టుకుని వస్తారు' అని కామెంట్ చేయగా.. మరికొందరు మాత్రం 'ఫస్ట్ మేకప్ తీసేసి రీల్స్ చెయ్... కనీసం లైకులు కూడా రావు' అంటూ రిప్లై ఇస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా ఆమెను దారుణమైన పదజాలంతో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X