For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కార్తీక దీపం’ వంటలక్కకు చేదు అనుభవం: ఆ హీరోయిన్‌తో కలిసుండగా.. ప్రేమీ విశ్వనాథ్‌పై తొలిసారి ఇలా!

    |

    వేరే భాషల్లో ఏమో కానీ.. తెలుగులో ప్రసారం అయ్యే డైలీ సీరియళ్లకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపించేదే. అందుకే బుల్లితెరపై ప్రసారం అయ్యే ఇవి విజయవంతంగా ప్రసారం అవుతూ వేలకు వేల ఎపిసోడ్లు సైతం పూర్తి చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో వచ్చే 'కార్తీక దీపం' ఒకటి. ఈ సీరియల్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక అందులో హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. అలాంటిది తొలిసారి ఆమెకు భారీ షాక్ తగిలింది. ఆ సంగతులు మీకోసం!

    ఆ సీరియల్ ఆధారంగా వచ్చిందే కార్తీక దీపం

    ఆ సీరియల్ ఆధారంగా వచ్చిందే కార్తీక దీపం

    దాదాపు మూడేళ్లుగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తోన్న సీరియల్ ‘కార్తీక దీపం'.. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘కరుతముత్తు'కు రీమేక్‌ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇక, ఇందులో హీరో డాక్టర్ బాబు.. దీప అలియాస్ వంటలక్కను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవలలు తల్లిదండ్రులను ఎలా కలిపారనేదే ఈ సీరియల్ కథ.

    దీప అలియాస్ వంటలక్క... తెలుగులో టాప్

    దీప అలియాస్ వంటలక్క... తెలుగులో టాప్

    ‘కార్తీక దీపం' సీరియల్‌కు మొదటి నుంచీ విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో రేటింగ్ లభిస్తోంది. ఇక, ఇందులో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా అదే స్థాయిలో పాపులారిటీ వచ్చింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఆమెను తమ ఆడపడుచుగా చేసేసుకున్నారు. దీంతో ఆమె తెగ పాపులర్ అయింది.

    దేశంలోనే మొదటి సీరియల్.. అప్పటి నుంచీ

    దేశంలోనే మొదటి సీరియల్.. అప్పటి నుంచీ

    ‘కార్తీక దీపం' ముందు బడా హీరోల సినిమాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి. అంతేకాదు, ఎన్నో చానెళ్లలో వస్తున్న కామెడీ షోలు సైతం దీని ముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి. అంతలా రేటింగ్ సాధిస్తోందీ వంటలక్క సీరియల్. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే రేంజ్‌లో రేటింగ్ రాబడుతూ ఇండియాలోనే ఈ ఘనత సాధించిన మొదటి సీరియల్‌గా నిలుస్తోంది.

    ప్రేమీ విశ్వనాథ్ రికార్డులు.. క్రేజ్ మరో బోనస్

    ప్రేమీ విశ్వనాథ్ రికార్డులు.. క్రేజ్ మరో బోనస్

    అద్భుతమైన నటనతో చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై తన హవాను చూపిస్తోంది ‘కార్తీక దీపం' హీరోయిన్ ప్రేమీ విశ్వనాథ్. అసాధారణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రేమీ విశ్వనాథ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

    ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెప్పేస్తుందిగా

    ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెప్పేస్తుందిగా

    నటిగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అంతేకాదు, కెరీర్‌కు సంబంధించిన విశేషాలనూ షేర్ చేస్తోంది. దీనితో పాటు తన ఫొటోలు, వీడియోలు వదులుతూ తన అభిమానులకు నిరంతరం టచ్‌లో ఉంటోంది.

    ‘కార్తీక దీపం’ వంటలక్కకు చేదు అనుభవం

    ‘కార్తీక దీపం’ వంటలక్కకు చేదు అనుభవం

    ఆదివారం స్టార్ మాలో ఓ స్పెషల్ ఈవెంట్ ప్రసారం అయింది. ఇందులో కార్తీక దీపం యూనిట్ రామాయణం నాటకాన్ని చేయగా.. నిరుపమ్ రాముడిగా.. ప్రేమీ విశ్వనాథ్ సీతగా నటించారు. ఈ పాత్రకు సంబంధించిన ఫొటో పక్కన శ్రీరామరాజ్యం సినిమాలోని నయనతార పిక్‌ను జత చేసిన ఫొటోను వంటలక్క సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది.

    ఆ ఫొటోలు.. ప్రేమీ విశ్వనాథ్‌పై తొలిసారి ఇలా!

    ఆ ఫొటోలు.. ప్రేమీ విశ్వనాథ్‌పై తొలిసారి ఇలా!

    ప్రేమీ విశ్వనాథ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అనుగుణంగానే ఆమె ఏ పోస్టు చేసినా.. విపరీతమైన స్పందన వస్తుంది. కానీ, తొలిసారి నెగెటివ్ కామెంట్స్‌తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తన సీత పాత్రతో పాటు నయనతార ఫొటో పోస్ట్ చేయగా.. ‘మేకప్ ఓవర్ అయింది' అని కొందరు.. ‘నయనతారతో నీకు పోలికా' అంటూ కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.

    English summary
    Deepa, a dark-skinned girl, is treated badly by her fair-skinned sister. She gets married to Dr Karthik but has to fight societal and family pressures in order to lead a happy married life. A mother, a wife, and a daughter-in-law were Tulasi's identity, but when these relations turned their back on her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X