ఏం అడిగినా ఇస్తా.. బిగ్‌బాస్ రాధిక ట్రాప్‌లో నిఖిల్, పృథ్వీ.. విష్ణుప్రియపై సోనియా అడల్డ్ ఎటాక్!
బిగ్‌బాస్ తెలుగు 8 సెకండ్ వీక్‌లోకి ప్రవేశించింది. తొలివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా .. సోమ, మంగళవారాలు నామినేషన్ గోల నడిచింది. ఫస్ట్ వీక్ ఎవ్వరికి పెద్ద పరిచయాలు లేకపోవడం హౌస్‌లోనూ ఎలాంటి యాక్టివిటీస్ జరగకపోవడంతో కంటెస్టెంట్స్‌కు నామినేషన్స్ చేయడానికి సరైన రీజన్ దొరకలేదు. గుడ్డుపేరు చెప్పి , కర్రీ పేరు చెప్పి ఆ ఎపిసోడ్ లాగించేశారు. అయితే ఈ వీక్ మాత్రం అలా కాదు ఫస్ట్ వీక్ గట్టిగా కొట్టుకున్నారు కాబట్టి.. నామినేషన్స్‌కి బోల్డన్నీ కారణాలు. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న సోనియా ఆకుల తన అభిమానులను డిజప్పాయింట్ చేస్తున్నారు. అదేంటో ఒకసారి చూస్తే :
ఇదిలాఉండగా .. హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్స్‌లో సోనియా ఆకుల స్ట్రాంగ్ కౌంటర్ అనిపించుకుంటున్నారు. ఏ విషయంపై అయినా ధాటిగా మాట్లాడుతూ తనతో పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సిగ్నల్స్ ఇస్తోంది సోనియా. ఆవిడతో పెట్టుకున్న బేబక్క ఫస్ట్ వీకే ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోనియా లేవదీసిన ఫుడ్ ఇష్యూ గాలివానగా మారి అందరూ అదే పాయింట్ లేవదీయడంతో బేబక్కకు ఎలా డిఫండ్ చేసుకోవాలో అర్ధం కాలేదు. ఆ దెబ్బతో కోలుకోలేక ఓటింగ్స్‌లోనూ వెనుకబడి చివరికి ఎలిమినేట్ అయ్యింది.

ఇంటి నుంచి బయటకు వస్తూనే సోనియా ఆకుల చాలా డేంజర్ అని, పక్కా స్ట్రాటజీతోనే ఆమె బిగ్‌బాస్ తెలుగు 8లో అడుగుపెట్టిందని చెప్పింది బేబక్క. శోభాశెట్టి, రతికలను మించి సోనియా ఖతర్నాక్ అని ఆవిడతో జాగ్రత్తగా ఉండాలని కంటెస్టెంట్స్‌ని హెచ్చరించింది. ఫస్ట్ వీక్ డామినేట్ చేసిన సోనియా.. ఈ వారం ఎందుకో డల్‌గా కనిపిస్తోంది. మిర్రర్ ముందు నిలబడి పెర్ఫామెన్స్ చూపిస్తోన్న ఈమెకు ఒకే ఒక్క ఓటు పడటంతో నామినేషన్స్ లిస్ట్‌లో పడకుండా జాగ్రత్త పడి ఈ వారానికి సేఫ్ అయ్యింది.
సోమవారం నాడు నోటికొచ్చినట్లు ఎంతొస్తే అంత మాట్లాడింది. ముఖ్యంగా యాంకర్ విష్ణుప్రియ క్యారెక్టర్, డ్రెస్సింగ్ సెన్స్ , ఫ్యామిలీ గురించి అసభ్యంగా మాట్లాడింది. ఆమెకు బట్టలు వేసుకోవడం కూడా రాదని, దీని వల్ల మిగతా కంటెస్టెంట్స్ ఇబ్బందిపడుతున్నారని ఆరోపించింది. విష్ణుప్రియ వల్ల ఆదిత్య ఓం డిస్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారని మిగతా ఇంటి సభ్యులకు కంప్లయింట్ చేసింది. ఈ దెబ్బతో విష్ణుప్రియకు నెట్టింట సింపతీ కార్డ్ వర్కవుట్ అవుతోంది.
స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన నిఖిల్, పృథ్వీలను ముగ్గులోకి దింపి ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తోంది. పృథ్వీ హ్యాండ్‌ని పట్టుకుని క్యూట్‌గా మాట్లాడుతోంది. నువ్వు సిగరెట్ తాగొద్దు, ఏమడిగినా ఇస్తా అని నిఖిల్‌ను కూడా డిస్ట్రబ్ చేస్తోంది. ఆ మాటలకు వాటర్ తాగుతున్న వాడు గుటకలు మింగాడు. తనకు పోటీగా ఉన్న నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియలను ఏదో రకంగా పక్కకునెట్టాలన్నది సోనియా స్ట్రాటజీ అని నెటిజన్లు అంటున్నారు. కొందరేమో ఈవిడేంటీ ఇలా దిగజారిపోయి , వరస్ట్ గేమ్ ఆడుతోందని మండిపడుతున్నారు. సోనియా ఆకుల విషయంలో ఏం జరగబోతోందో చూద్దాం.


Click it and Unblock the Notifications











