నువ్వు వర్జిన్‌వేనా? మీ తొలి అనుభవం ఎప్పుడు జరిగింది? శ్రీ సత్య, మెహబూబ్‌ను దారుణంగా!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది సెలెబ్రిటీలు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. అలాగే, తమ క్రేజ్‌ను కూడా అంతకంతకూ పెంచుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ మెహబూబ్ దిల్‌సే ఒకడు. బిగ్ బాస్ తర్వాత యమ గుర్తింపును సొంతం చేసుకున్న అతడు.. ఇప్పుడు 'బీబీ జోడీ'లో శ్రీ సత్యతో కలిసి సందడి చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌ను నిర్వహించారు. ఇందులో నెటిజన్లు వీళ్లకు షాక్ ఇచ్చారు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీరే చూడండి!

శ్రీ సత్య అలా.. మెహబూబ్ ఇలా
మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన శ్రీ సత్య.. తనదైన అందంతో మెప్పించి మిస్ ఆంధ్రాగా గెలిచింది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో కీలక పాత్రతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టి.. సీరియల్ హీరోయిన్‌గా మారింది. ఇక, మెహబూబ్ యూట్యూబర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టి.. బిగ్ బాస్‌తో సెలెబ్రిటీగా మారాడు. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోన్నాడు.

బీబీ జోడీ కోసం జంటగా మారి
స్టార్ మా ఛానెల్‌లో ప్రస్తుతం 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ రియాలిటీ షో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకూ వచ్చిన బిగ్ బాస్ సీజన్లలోని కొందరు కంటెస్టెంట్లను జంటలుగా మార్చి వాళ్ల మధ్య పోటీని పెట్టారు. మెహబూబ్‌కు మొదట అషు రెడ్డి పార్ట్‌నర్‌గా వచ్చింది. కానీ, ఆమె అనుకోకుండా తప్పుకుంది. దీంతో శ్రీ సత్యను అతడికి జోడీగా తీసుకొచ్చారు.

అదిరే డ్యాన్సులు.. టాప్‌లోనే
స్వతహాగా డ్యాన్సర్ అయిన మెహబూబ్ 'బీబీ జోడీ' షోలో తనదైన స్టైల్స్, డ్యాన్స్‌తో యమ అలరిస్తున్నాడు. అతడి స్పీడును శ్రీ సత్య అందుకుంటుందా అని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు. వాటన్నింటనీ పటాపంచలు చేస్తూ ఆమె కూడా అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్లను చేస్తోంది. ఫలితంగా ఈ జంట ఈ షోలోని టాప్ జోడీల్లో ఒకటిగా నిలుస్తూ సత్తా చాటుతూనే ఉంది.

సోషల్ మీడియా లైవ్‌లో షాక్
'బీబీ జోడీ' షోలో టాప్ కంటెస్టెంట్లుగా పేరు తెచ్చుకున్న మెహబూబ్, శ్రీ సత్య.. బయట కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ సమయంలోనే కాకుండా తరచూ కలుస్తున్నారు. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీ సత్య, మెహబూబ్ కలిసి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లైవ్‌ను నిర్వహించారు.

నువ్వు వర్జిన్‌వేనా? ఏం ప్రశ్న
శ్రీ సత్యతో కలిసి చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌కు సంబంధించిన వీడియోను మెహబూబ్ తాజాగా తన అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చదివి వాళ్లిద్దరూ సమాధానాలు చెప్పారు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ మెహబూబ్‌ను 'అన్నా.. నువ్వు వర్జిన్‌వేనా' అని సూటిగా ప్రశ్నించాడు. దీనికతడు 'అరేయ్.. ఏం ప్రశ్నరా ఇది' అంటూ అతడిపై ఫైర్ అయ్యాడు.

అక్కా నీ తొలి ముద్దు ఎప్పుడు
ఆ తర్వాత శ్రీ సత్యకు సంబంధించిన ప్రశ్నలను కూడా మెహబూబ్ చదివి వినిపించాడు. ఇందులో భాగంగానే ఓ నెటిజన్ 'సత్య అక్కా.. మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు అయింది' అంటూ ప్రశ్నించాడు. దీంతో శ్రీ సత్యకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ వెంటనే ఆమె 'ముందు ఇది చెప్పు.. అక్కా అని అంటూ అక్కను ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా నువ్వు' అంటూ ఆ నెటిజన్‌పై కోప్పడింది.
అంతా అలాగే.. వీడియో వైరల్
ఇక, ఇందులో శ్రీ సత్యను 'నీకు అర్జున్ ఇష్టమా? మెహబూబ్ ఇష్టమా?'.. 'మనోహరి సాంగ్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతావు' అని ఎన్నో ప్రశ్నలు అడిగారు. అలాగే, మెహబూబ్‌ను కూడా ఇలాంటి కొంటె ప్రశ్నలే ప్రశ్నించారు. ఓ సందర్భంలో శ్రీ సత్య 'ఫీమేల్ ఫ్రెండ్స్ అనేది నో మేటర్.. నేనైతే చెప్పు తీసుకుని కొడతా' అని అంది. దీంతో ఈ వీడియో మయ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











