న్యూఇయర్ వేళ రెచ్చిపోయిన అనసూయ..నెటిజన్లు దారుణంగా కామెంట్స్!
యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి నటిగా వెలుగొందుతున్నారు అనసూయ భరద్వాజ్. ఇండస్ట్రీలోకి వచ్చిన షార్ట్ గ్యాప్‌లోనే ఈమె ఈ స్థాయికి చేరుకున్నారు. 40కి చేరువైనా హీరోయిన్లను మించిన అందంతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడతారు అనసూయ. యాంకరింగ్‌కు గ్యాప్ ఇచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే అనసూయ అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు.
సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు అనసూయ భరద్వాజ్. తర్వాత ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్‌కి ఎప్పుడైతే యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిందో నాటి నుంచి అనసూయ జీవితం పూర్తిగా మారిపోయింది. తన అందం, హాట్ షో, మధ్యలో పంచ్‌లతో జబర్దస్త్ షో బ్లాక్ బస్టర్ కావడంలో తన వంతు పాత్ర పోషించారు. జబర్దస్త్‌తో వచ్చిన పాపులారిటీతో సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలకు హోస్ట్‌గా అవకాశాలను అందుకుని స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు.

ఇదే సమయంలో సినిమాల్లోనూ అనసూయకు అవకాశాలు వచ్చాయి. రంగస్థలం , క్షణం, విన్నర్, గాయత్రి, ఎఫ్2, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, భీష్మ పర్వం, ఖిలాడీ, విమానం, పెద్దకాపు, రజాకార్ వంటి సినిమాల్లో అనసూయ నటించింది. నటిగానే కాకుండా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టారు. ఇక పుష్ప పార్ట్ 1, పార్ట్ 2లలో ద్రాక్షాయణిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించారు.
ఆమె కోసమే రచయితలు కొన్ని పాత్రలు సృష్టిస్తున్నారంటే అనసూయ వెండితెరపై ఎలాంటి ముద్ర వేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇక పేరుతో పాటే వివాదాలు కూడా ఆమెను చుట్టుముట్టాయి. మరీ ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్, పబ్లిక్‌గా ముద్దులు, హగ్గులు, బికినీలతో ట్రోలింగ్‌కు గురవుతుంటారు. అయితే ఇలాంటి వారిని అనసూయ అంత తేలిగ్గా వదిలిపెట్టరు.. గతంలో పలువురు నెటిజన్లు, వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఆమె ఫిర్యాదులు చేశారు.
సినిమాలు, షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు ఈ స్టార్ యాంకర్. వీలు కుదిరినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తుంటారు. ఇంట్లో పండుగలు, నోములు, ఇతర శుభకార్యాలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ మిస్ కారు. తాజాగా న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని భర్త, పిల్లలతో కలిసి బీచ్‌లో వేడుకలు జరుపుకున్నారు. డీప్ నెక్ డ్రెస్‌లో ఎద అందాలు క్లియర్‌గా కనిపించేలా, మెడలో నెక్లెస్‌తో ఉన్న అనసూయ ఫోటోలు సెగలు రేపుతున్నాయి. అయితే వీటికి నెటిజన్లు వల్గర్‌గా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇలాంటి ఆకతాయిలపై అనసూయ ఎలాంటి యాక్షన్‌లోకి దిగుతారో చూడాలి.


Click it and Unblock the Notifications










