Jabardasth New Anchor: జబర్ధస్త్‌లోకి కొత్త యాంకర్.. ఊహించని విధంగా ఎంట్రీ.. అనసూయ స్థానం ఆమెదేనా!

తెలుగు బుల్లితెర చరిత్రలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న ఏకైక కామెడీ షో జబర్ధస్త్. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా తొమ్మిదేళ్లుగా టెలివిజన్‌ రంగంలో హవాను చూపిస్తోన్న ఈ కార్యక్రమం.. అప్పటికీ ఇప్పటికీ ఒకే రకమైన రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. తద్వారా భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సైతం రాబడుతోంది.

ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో వచ్చినప్పటికీ అవన్నీ దీని ప్రభావానికి తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోయాయి. అంతలా ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో జబర్ధస్త్ ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ షో నుంచి యాంకర్ అనసూయ భరద్వాజ్ వెళ్లిపోయింది. దీంతో ఆమె స్థానంలో కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఎవరామె? ఆ వివరాలు మీకోసం!

వందల మందికి లైఫ్ ఇచ్చిన షో

వందల మందికి లైఫ్ ఇచ్చిన షో


తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. చెరిగిపోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా బుల్లితెరపైకి ఎంతో మంది టాలెంట్ ఉండి అవకాశాలు లేని వాళ్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లే ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్లుగా వెలుగొందుతున్నారు. అలాగే, కొన్ని వందల మందికి ఈ షో ద్వారా జీవనోపాధి కల్పిస్తూ విజయవంతంగా సాగుతోంది.

వాళ్లకు కూడా బాగా కలిసొచ్చింది

వాళ్లకు కూడా బాగా కలిసొచ్చింది


జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు కూడా మరింతగా హైలైట్ అయ్యారు. ఇక, ఇందులో యాంకర్లుగా చేస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌ కెరీర్‌ ఎదుగుదలకు కూడా జబర్ధస్త్ షో ఓ రేంజ్‌లో బూస్టును ఇచ్చిందనే చెప్పుకోవాలి.

ఎన్నో మార్పులు.. కొత్త కంటెంట్

ఎన్నో మార్పులు.. కొత్త కంటెంట్

రోజులు గడుస్తోన్న కొద్దీ జబర్ధస్త్ షోలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. కామెడీ డోసును పెంచేందుకు టీమ్ లీడర్లు అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కొత్త కొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే సమయంలో షో నిర్వహకులు కూడా కొన్ని హంగులను జోడిస్తూ ప్రేక్షకులకు మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో షో మరింత సక్సెస్ అవుతోంది.

వాళ్లంతా ఔట్... నష్టం రాకుండా

వాళ్లంతా ఔట్... నష్టం రాకుండా

గతంలో కంటే ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ షో నుంచి ఎంతో మంది స్టార్ కమెడియన్లు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే గెటప్ శ్రీను, అదిరే అభి, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, సుడిగాలి సుధీర్, ముక్కు అవినాష్, హైపర్ ఆది సహా ఎంతో మంది టీమ్ లీడర్లు ఈ షోకు గుడ్‌బై చెప్పేశారు. వీళ్ల బాటలోనే మరికొందరు కమెడియన్లు కూడా వేరే ఛానెళ్లలోకి వెళ్లిపోతూనే ఉన్నారు.
జబర్థస్ద్‌ షోకు అనసూయ గుడ్‌బై

జబర్థస్ద్‌ షోకు అనసూయ గుడ్‌బై

ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ.. సుదీర్ఘ కాలంగా అందులోనే సత్తా చాటుతూ వచ్చింది. కానీ, గత వారం ప్రసారం అయిన ఎపిసోడ్‌తో ఈ అమ్మడు ఈ షోకు గుడ్‌బై చెప్పేసింది. ఈ క్రమంలోనే చాలా వారాల క్రితమే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వరుసగా షోలు, ఈవెంట్లు చేస్తూ సందడి చేస్తోంది.

జబర్ధస్త్‌ షోలోకి కొత్త యాంకర్ రాక

సుదీర్ఘ కాలం పాటు జబర్ధస్త్ షోకు యాంకర్‌గా పని చేసిన అనసూయ భరద్వాజ్.. వచ్చే ఎపిసోడ్ నుంచి ఇందులో కనిపించదు. దీంతో ఆమె స్థానంలో ఇందులోకి యాంకర్‌గా ఎవరు వస్తారన్న దానిపై చాలా రకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జబర్ధస్త్ షోలోకి కొత్త యాంకర్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ వాళ్లు విడుదల చేశారు.

గ్రాండ్ వెల్‌కం.. యాంకర్ ఆమేనా

గ్రాండ్ వెల్‌కం.. యాంకర్ ఆమేనా

అనసూయ స్థానంలో జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చే యాంకర్ గురించి తాజాగా వచ్చిన ప్రోమోలో చూపించారు. ఇందులో ఆమెను పల్లకిలో తీసుకొచ్చి మరీ గ్రాండ్ వెల్‌కం చెప్పారు. కానీ, ఆ యాంకర్ ఎవరన్నది మాత్రం చూపించలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. అనసూయ స్థానంలో వచ్చింది రష్మీ గౌతమే అని తెలిసింది. దీన్ని గురువారం రివీల్ చేస్తారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X