షన్ను-సిరి రొమాన్స్ తో విసిగిపోయిన దీప్తి.. బ్రేకప్ తథ్యమా.. అసలు ఏం జరుగుతోంది?

తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా భారీ స్పందన వస్తుంది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ప్రసారం అవుతున్న సీజన్‌ ను పది గంటలకు ప్రసారం చేస్తున్నారు. ఈ సారి ప్రసారం అవుతున్న షో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే షోలో ఉన్న షణ్ముఖ్, బయట ఉన్న ప్రేయసి దీప్తి మధ్య దూరం పెరుగుతుందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

రెండే వారాలు

రెండే వారాలు

బిగ్ బాస్-5 లో రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర 'టికెట్ టు ఫినాలే' గెలుచుకోగా ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది.

వాళ్ళు సేఫ్

వాళ్ళు సేఫ్

ఇక శ్రీరామ్ ను పక్కన పెడితే సన్నీ, షణ్ముఖ్‌లకు మంచి ఓటింగ్ ఉండడంతో టాప్ 2 కంటెస్టెంట్లుగా ఉంటారు సో వాళ్ళు ఇద్దరూ సేఫ్ అన్న మాట. దీంతో సిరి, కాజల్, మానస్‌లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తాజా టాక్ ప్రకారం ఈ ముగ్గురు హౌస్ మేట్స్ లో ఓట్ల ప్రకారంగా కాజల్ కు బాగానే ఓటింగ్ నమోదు అవుతోంది. అలాగే మానస్ కూడా తరువాత మంచి ఓటింగ్స్ సాధించినట్టు చెబుతున్నారు. ఆ తరువాత స్థానంలో సిరి ఉందట.

ఏకంగా 19 మంది

ఏకంగా 19 మంది

అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అందులో సోషల్ మీడియా ద్వారానో.. బుల్లితెర వెండితెరపై సందడి చేసే వాళ్లుగానో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇందులో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. అతడికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడంతో మంచి పోటీ ఇస్తున్నారు.

బ్రేకప్

బ్రేకప్


ఇక దీప్తి సునైనా - షణ్ముఖ్ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు, షో తర్వాత దీప్తి సునైనా షణ్ముఖ్‌తో విడిపోయే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ సిరితో హగ్గులు, ఆమెను ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తూ సిరి ఎవరితోనైనా సన్నిహితంగా ఉన్నప్పుడు అసూయతో ప్రవర్తిస్తున్నట్టు బయటకు ప్రొజెకిట్ అవుతోంది. దీంతో హౌస్‌లో షణ్ముఖ్ సిరి మధ్య జరుగుతున్న పరిణామాలను చూసి దీప్తి సునైనా హర్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రేక్షకుల్లో ఒక వర్గం ప్రచారం చేస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Deepthi Sunaina's Romantic Wish - Shanmukh Emotional || Filmibeat Telugu
దూరం

దూరం


షో ముగిసిన తర్వాత దీప్తి సునైనా షణ్ముఖ్‌కు దూరం కావచ్చని సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. అయితే అది నమ్మదగ్గ విషయం అయితే కాదు ఎందుకంటే ఆమె ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతనికి మద్దతు ఇస్తూనే ఉంది. అంతే ఆ తర్వాత కూడా, దీప్తి షన్నుని ఉత్సాహపరిచేందుకు ఫ్యామిలీ రీయూనియన్ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. ఇది ఉబుసుపోక ఉండేవాళ్ళు సృష్టించిన గాసిప్ అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X