మతిపోగొడుతున్న కొత్త యాంకర్.. అనసూయ, రష్మీని తలదన్నేలా!

Recommended Video

Anchor Varshini Is The New Sensation In Tollywood | Filmibeat Telugu

బుల్లి తెరకూడా క్రమంగా గ్లామర్ మయంగా మారుతోంది. బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలతో ప్రేక్షకులు కాస్త రిలాక్స్ కావాలని ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్లకు చక్కటి వినోదాన్ని అందిస్తూ పాపులర్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ దూసుకుపోతోంది. ఈ షోకు అత్యధిక టిఆర్పి రేటింగ్స్ నమోదవుతున్నాయి. జబర్దస్త్ తో సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, గెటప్ శీను ఇలా చాలా మంది కొత్త నటులు వెలుగులోకి వస్తున్నారు. వీరంతా సినిమాల్లో కూడా అవకాశాలు పొందుతున్నారు. ఇక జబర్దస్త్ షోలో రష్మీ, అనసూయ యాంకర్స్ గా ఉంటున్నారు. వీరి యానకరింగ్ తో పటు గ్లామర్ కూడా ఈ షోకు ప్లస్ అని చెప్పొచ్చు. తాజాగా జబర్దస్త్ షో గురించి వస్తున్న వార్తలు ఆసక్తిరేపుతున్నాయి.

విమర్శలు వస్తున్నా

విమర్శలు వస్తున్నా

జబర్దస్త్ లో హాస్యం కంటే మసాలా ఎక్కువవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రష్మీ, అనసూయ ఘాటుగానే గ్లామర్ ప్రదర్శిస్తున్నారు. స్కిట్ లో భాగంగా వారిపై కూడా కొన్ని పంచ్ డైలాగ్స్ పడుతుంటాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా వినిపిస్తుంటాయి. ఈ వ్యవహారం మొత్తం టిఆర్పి రేటింగ్ కోసం హాస్యాన్ని పక్కదోవ పట్టించేలా ఉందనే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న విమర్శ.

 జబర్దస్త్‌తో క్రేజ్

జబర్దస్త్‌తో క్రేజ్


యాంకర్ రష్మీ పేరు చెప్పగానే జబర్దస్త్ గుర్తుకు వస్తుంది. జబర్దస్త్ షో ద్వారానే రష్మీ ఇంతలా క్రేజ్ తెచ్చుకుంది. గుంటూర్ టాకీస్, అంతకు మించి లాంటి ఘాటు చిత్రాల్లో నటించి అందాలు ఆరబోసింది. ఇందంతా జబర్దస్త్ తెచ్చిపెట్టిన క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక అనసూయ అప్పటికే యాంకర్ గా కొంత గుర్తింపు తెచ్చుకుంది. జబర్డస్త్ షోకి యాంకర్ గా మారిన తరువాత ఇంకా పాపులర్ అయింది. అనసూయ గ్లామర్ కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు.

అనసూయ సీటు గల్లంతేనా

అనసూయ సీటు గల్లంతేనా


ఇదిలా ఉండగా అనసూయ ఇటీవల నటిగా కూడా బిజీగా మారుతోంది. రంగస్థలం చిత్రంలో అనసూయ పోషించిన రంగమత్త పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తరువాత అనసూయకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల బిజీ షెడ్యూల్ కారణంగా జబర్దస్త్ నుంచి అనసూయ తప్పుకుంది. దీనితో తాత్కాలికంగా అనసూయ స్థానంలోకి వర్షిణి అనే కొత్త యాంకర్ ని తీసుకుని వచ్చారు.

మాయ చేస్తున్న వర్షిణి

మాయ చేస్తున్న వర్షిణి

వర్షిణి యాంకరింగ్ కు, హాస్య చతురత, హవభవాలకు బుల్లి తెర అభిమానులు ఫిదా అవుతున్నారు. వర్షిణి.. అనసూయ, రష్మీని తలదన్నేలా యాంకరింగ్ చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వర్షిణిని ఇక పర్మనెంట్ గా జబర్దస్త్ యాంకరింగ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అనసూయ చాల రోజులగా జబర్డస్త్ లో యాంకర్ గా కొనసాగుతోంది. దీనితో కొత్త ముఖం కనిపించగానే ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. బుల్లి తెరకు మరో గ్లామరస్ యాంకర్ దొరికిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X