బిగ్ బాస్‌లో జంబలకడిపంబ.. ఆడవాళ్లు మగాళ్లులా.. వీళ్లు వాళ్లలా..
'బిగ్ బాస్' సీజన్ - 3 రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. ఒకవైపు, ఎలిమినేషన్‌కు ఎనిమిది సభ్యులు నామినేట్ అవగా, బాస్ మాత్రం రోజుకో టాస్క్ ఇస్తున్నాడు. ఇప్పటికే లగ్జరీ బడ్జెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసిన కంటెస్టెంట్లు గ్యాస్, వాటర్, ఇంటి వాడకంను యదావిథిగా ఉంచుకున్నారు. దీంతో ఇంటి సభ్యులు ఖుషీగా ఉన్నారు. అదే సమయంలో వరుణ్ సందేశ్, తమన్నా సింహాద్రిని జైలులోకి పంపిన 'బిగ్ బాస్' మిగిలిన కంటెస్టెంట్లకు హెచ్చరికలు పంపాడు. దీంతో బుధవారం ఎపిసోడ్ పూర్తయింది.
ఇక, గురువారం 'బిగ్ బాస్' హౌస్‌లో సరికొత్త టాస్క్‌లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. స్టార్ మా తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఈ ప్రోమోలో హౌస్‌లోని ఆడవాళ్లు మగవాళ్ల వేషం వేయగా.. వీళ్లు వాళ్లలా మారిపోయారు. అంతేకాదు, డ్యాన్స్‌లు, పాటలు, మాటలతో హౌస్ అంతా సందడిగా కనిపిస్తోంది. దీంతో గురువారం 'బిగ్ బాస్' ప్రేమికులకు చక్కని సన్నివేశాలు కనిపించే ఆస్కారం ఉంది.

ఇక, అంతకుముందు విడుదల చేసిన ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్ల బలానికి పరీక్ష పెట్టారు. గార్డెన్ ఏరియాలో ఒక వజ్రాన్ని పెట్టి, దాన్ని బజర్ మోగినప్పుడు ఎవరైతే తీసుకు వస్తారో వాళ్లే విజేతలు అన్నట్లుగా 'బిగ్ బాస్' ప్రకటిస్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ బల ప్రదర్శన చేసుకోవడం ఆ ప్రోమోలో చూపించారు. చివర్లో ఎవరో కింద పడిపోయినట్లు కనిపించింది.
ఇదిలాఉండగా, ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకునేందుకు కంటెస్టెంట్లు అందరూ ఎన్నో సాహసాలు చేస్తున్నారు. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం షో చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.


Click it and Unblock the Notifications











