twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ.. వాళ్లు చేసిన పనికి రవికృష్ణకే కోపం వచ్చేసింది

    |

    'బిగ్ బాస్' రియాలిటీ షో ఊహించిన దాని కంటే ఎక్కువ రేటింగ్‌తో దూసుకుపోతోంది. గత రెండు సీజన్లతో పోలిస్తే.. ఈ సారి కంటెస్టెంట్లలో అంతగా పేరున్న వాళ్లు లేకపోయినా.. షో మాత్రం ప్రేక్షకాదరణను పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరిగే రచ్చే. సీజన్ ప్రారంభమైన మొదటి వారంలోనే కంటెస్టెంట్లు గొడవలు పెట్టుకుని గ్రూపులుగా ఏర్పడ్డారు. దీంతో రాజకీయాలు ఎక్కువైపోయాయి. దానికి తోడు, బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా అలాగే ఉండడంతో గ్రూపుల మధ్య విభేదాలు ఎక్కువై పోతున్నాయి.

    ఇక, నాలుగో వారం ప్రారంభంలో నామినేషన్ ప్రక్రియ కొత్తగా జరిగింది. దీని ప్రకారం.. ఇద్దరు.. ఇద్దరిని కన్‌ఫెషన్ రూమ్‌కు పంపించి, 'మీ ఇద్దరిలో ఎవరు నామినేట్ అవుతారు..? ఎవరు సేఫ్ అవుతారు..? తేల్చుకోండి' అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయిపోయారు. ఈ ప్రక్రియంలో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత బక్రీద్ సందర్భంగా ఇంట్లో సంబరాలు కూడా జరిగాయి.

    నామినేషన్ ప్రక్రియ, సంబరాలతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక, మంగళవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరగనుంది. ఇందులో భాగంగా ఇంట్లోని కంటెస్టెంట్లను రెండు జట్లుగా విభజించిన బిగ్ బాస్ వాళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన టాస్క్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో కంటెస్టెంట్లు జెండాల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సీరియస్ దృశ్యాలు కూడా కనిపించాయి. విశేషమేమిటంటే.. ఎప్పుడూ కూల్‌గా ఉండే రవికృష్ణ సైతం కోప్పడడం కనిపించింది.

    New Task In Bigg Boss House.. Ravi Krishna angry

    ఈ ప్రోమో ప్రకారం.. శ్రీముఖి, మహేశ్, అలీ రేజా, రాహుల్ సింప్లీగంజ్, హిమజ, అషురెడ్డి ఒక జట్టుగా మిగిలిన వారందరూ మరో జట్టుగా కనిపించారు. ఈ టాస్క్‌లో కచ్చితంగా గొడవలు జరిగే సూచనలే కనిపిస్తున్నాయి. దీనికి కారణం వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరూ వేరు వేరు గ్రూపుల్లో ఉండడమే.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X