కంటెస్టెంట్స్‌కు షాకిచ్చిన బిగ్ బాస్.. ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. నిజస్వరూపాలు బయటకు.!

Recommended Video

Nomination for elimination starts tonight #BiggBossTelugu3

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు ఎవరు వస్తారు.. ఎవరు వెళ్లిపోతారు అనేది రహస్యంగానే ఉంటోంది. కానీ, ఎలిమినేషన్ కోసం చేసే నామినేషన్ ప్రక్రియ మాత్రం అందరికీ తెలిసే జరుగుతోంది. ఇదే చాలా మంది మధ్య గొడవలకు కారణం అవుతోంది. తమను నామినేట్ చేయడానికి చెప్పే కారణాలు మిగిలిన కంటెస్టెంట్లకు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎన్నో రాజకీయాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ వారం బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..

మొదటి వారం కొత్తగా..

మొదటి వారం కొత్తగా..

‘బిగ్ బాస్' మొదటి వారం నామినేషన్ ప్రక్రియను ఎవరూ ఊహించని విధంగా రూపొందించాడు. హౌస్‌లోకి వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లు మిగిలిన వారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వారిలో ఎవరు సరిగా ఆన్సర్ చేయలేదో చెప్పాలని ఆ ముగ్గురిని కోరాడు. వాళ్లు చెప్పిన వారిని నామినేట్ చేశాడు. తర్వాత కొన్ని మార్పులు జరగడంతో హేమ కూడా ఈ జాబితాలోకి వచ్చి ఎలిమినేట్ అయింది.

రెండో వారం రహస్యంగా..

రెండో వారం రహస్యంగా..

రెండో వారం ఎలిమినేషన్ కోసం ‘బిగ్ బాస్' ఒక్కో కంటెస్టెంట్‌ను కన్‌ఫెషన్ రూంకి పిలిచి.. నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి పేర్లను, అందుకు కారణాలను వెల్లడించాలని ఆదేశించాడు. ప్రక్రియ పూర్తయ్యే సరికి ఆ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చే కంటెస్టెంట్లుగా శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు నామినేట్ అయ్యారు. వీరిలో నుంచి జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు.

మూడో వారం స్టాంపు గుద్దించాడు

నామినేషన్ ప్రక్రియ మూడో వారం మాత్రం సీరియస్‌గా జరిగింది. దీనికి కారణం పునర్నవినే అన్న విషయం తెలిసింది. ఒక్కొక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పిన బిగ్ బాస్.. తమకు ఇష్టం లేని ఇద్దరి కంటెస్టెంట్స్‌‌ పేరు చెప్పి వాళ్లకు నామినేషన్ స్టాంప్ గుద్దాలని స్టాంప్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఈవారం ఎలిమినేషన్‌లో నిలిచారు. వీరి నుంచి తమన్నా వెళ్లిపోయింది.

ఈ వారం ట్విస్ట్

ఈ వారం ట్విస్ట్

ఇక, ఈ వారం నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దీని ప్రకారం.. ఈ వారం ఇద్దరు.. ఇద్దరిని కన్‌ఫెషన్ రూమ్‌కు పంపించి, ‘మీ ఇద్దరిలో ఎవరు నామినేట్ అవుతారు..? ఎవరు సేఫ్ అవుతారు..? తేల్చుకోండి' అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయిపోయారు. ఈ క్రమంలోనే బాబా భాస్కర్ ‘ఏం స్కెచ్ వేశారు సార్' అనడం కనిపించింది.

నిజస్వరూపాలు బయటపడతాయి

నిజస్వరూపాలు బయటపడతాయి

ఇన్ని రోజులు డైరెక్టుగానో.. రహస్యంగానో నామినేషన్ ప్రక్రియ సాగింది. ఇక, ఈ వారం ఇద్దరిని పిలిచి నామినేట్ చేస్తున్నారు. దీంతో ఎవరు గేమ్ ఆడుతున్నారు..? ఎవరు నిజాయితీగా ఉంటున్నారు..? అనేది తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు కంటెస్టెంట్ల నిజస్వరూపాలు బయటపడే ఛాన్స్ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X