ఎవరు మీలో కోటీశ్వరుడు: అసలైన అప్డేట్ రెడీ.. ఎన్టీఆర్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు ఆల్ రౌండర్స్ అని నిరూపించుకుంటున్నారు. సినిమాలతో ఒకవైపు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా మరోవైపు బుల్లితెరపై కూడా సాలీడ్ టిఆర్పి ను అందుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెర అభిమానులు జెమినీ టీవీలో ప్రసారం కానున్న ఎన్టీఆర్ షో కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అసలైన అప్డేట్ రెడీ అయ్యింది.

మళ్ళీ చాలా కాలం తరువాత
బిగ్ బాస్ తో హోస్ట్ గా మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. ఆ షో మొదటి సీజన్ కే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. అనంతరం మిగతా హీరోలు అదే ఎనర్జీతో షోను కొనసాగించారు. అయితే మళ్ళీ చాలా కాలం తరువాత తారక్ ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షోతో వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

RRR ముఖ్యమైన పనులు అయిపోవడంతో
దాదాపు RRR షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక సన్నివేశాలు కూడా ఆల్ మోస్ట్ ఫినిష్ అయ్యాయి. అయితే ఆ సినిమా రాకముందే తారక్ ఒక రియాలిటీ షోను స్టార్ట్ చేయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. జెమిని టీవీలో ఈ షో వీకెండ్స్ లో ప్రసారం కానుంది.

మేము విన్నాము, మేము ఉన్నాము..
అయితే జెమిమి టీవీ యాజమాన్యం మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది. రేపు అసలైన అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. మేము విన్నాము, మేము ఉన్నాము.. అనే ట్యాగ్ లైన్ ద్వారా ఈ వారం సంతోషాన్ని మరింత రెట్టింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అప్డేట్ వైరల్ గా మారింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో
ఇక ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏవరు మీలో కోటీశ్వరుడు టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో కొన్ని వారాల క్రితం షూటింగ్ కూడా పూర్తి చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక రక్షణ వలయాల మధ్య షూటింగ్ ను కొనసాగిస్తారట. మరి రాబోయే అప్డేట్ ఆడియెన్స్ కు ఎంతవరకు కిక్కిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











