ఈ కొత్త పెళ్లి జంట బిగ్ బాస్ హౌస్ లోకా.. ఇంకేమైనా ఉందా!
Recommended Video

ఇండియాలో బిగ్ హోస్ షో కు రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఇండియాలో అత్యధిక ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షోగా బిగ్ బాస్ మారిపోయింది. అన్ని భాషల్లో బిగ్ బాస్ షో వలన కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. ఆ స్థాయిలో బిజినెస్ జరిగే ఈ షోని జనరంజకంగా మార్చేందుకు నిర్వాహకులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ 12 వ సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది. బిగ్ బాస్ 12 గురించి తాజగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ అత్యంత ఆసక్తికరంగా మారిపోయింది.

కొత్త జంట
బాలీవుడ్ నటుడు, మోడల్ అయిన 52 ఏళ్ల మిలింద్ సోనమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ వయసులో కూడా మిలింద్ సోనమ్ ఎంతటి రొమాంటిక్ వీరుడో అందరికి తెలిసిందే. 52 ఏళ్ల మిలింద్ ఇటీవల 26 ఏళ్ల అంకిత అనేయువతిని వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు.

బిగ్ బాస్ ఛాన్స్
మిలింద్, అంకితని ఇటీవల బిగ్ బాస్ నిర్వాహకులు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిని బిగ్ బాస్ 12 లో సభ్యులుగా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కపుల్స్ బిగ్ బాస్ హౌస్ లో ఉంటె షోకి మరింత క్రేజ్ వస్తుంది.

ఇద్దరూ
మిలింద్, అంకిత ఇద్దరూ బిగ్ బాస్ 12 లో పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని వార్తల ప్రకారం వీరిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని అంటున్నారు. ఈ వార్తలన్నీ అవాస్తవాలని మరో వార్త ప్రచారం జరుగుతోంది.

సల్లూ భాయే
బిగ్ బాస్ 12 కి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. బిగ్ బాస్ 12 గురించి వస్తున్న వార్తల ప్రకారం ఈ షోలో మొత్తం 21 మంది సభ్యులు ఉండొచ్చని అంచనా. రియల్ జోడిలతో సరికొత్తగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో భార్య భర్తలు ఉండవచ్చు, బ్రదర్స్ ఉండవచ్చు, అత్తా కోడళ్ళు కూడా ఉండవచ్చని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











