ఉదయభాను కి చంపేస్తామంటూ బెదిరింపులు

By Srikanya

హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ్ భాను ప్రస్తుతం పొలిటీషియన్స్ ని నిలదీయమంటూ టీవీ 9 ఛానెల్ కు ఓ పోగ్రాం చేస్తోంది. ఆ పోగ్రాం పేరు నిగ్గదీసి అడుగు. ఈ పోగ్రాం తో ఆమె చాలా మంది పొలిటీషన్స్ ను కలుస్తోంది. అలాగే వారి తప్పులను టీవీ సాక్షిగా నిలదీస్తోంది. ఇది చాలా మంది పొలిటీషన్స్ కు మింగుడుపడటం లేదని సమాచారం. దాంతో ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉదయభాను సైతం ధృవీకరిస్తోంది.

ఉదయభాను మాట్లాడుతూ... తాను చిన్నప్పటినుంచీ సామాజిక భాధ్యతతో సమాజంలోని తప్పులు పట్ల స్పందించేదాన్నని, ఇప్పుడూ అదే తరహాలో తమ పోగ్రాం ద్వారా చేస్తున్నానని అంటో్ంది. అలాగే తాను చాలా మంది పవర్ ఫుల్ గా ఇన్ఫూలియన్స్ కలిగిన రాజకీయనాయకులను కలవటం జరుగుతోందని, వారిలో కొందరి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అంటోంది. కానీ తాను అటువంటివి లెక్క చేయనని, తాను అనుకున్న దారిలో ప్రయాణిస్తానని చెప్పుకొచ్చింది.

Niggadeesi Adugu: Udaya Bhanu receiving death threats!

ఈ పోగ్రాం ద్వారా ఆమె రాజకీయనాయుకులపై, అక్కడ పరిష్కారం కాని సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచనుంది. తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఎక్కడైనా ప్రజలే బాధితులు...మాట తప్పే నాయకులను సహించవద్దు...మీ కష్టాలను నాతో చెప్పండంటూ ముందుకు వస్తోంది. ఈ పోగ్రాం నిమిత్తం ఆమె సామాన్యులను కలుస్తోంది. అందుకోసం ఆమె టూర్ వేస్తోంది. ఇప్పటివరకూ ఈ పోగ్రాం లో భాగంగా అనంతపూర్, ఖమ్మం, అదిలాబాద్, కర్నూలు, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలు పర్యటించి కార్యక్రమం నిర్వహించారు.

ఇక గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందంటూ ప్రచారం సాగుతున్న టీవీ యాంకర్, నటి ఉదయభాను ఈ పోగ్రామ్ తో కంక్లూజన్ కి వచ్చినట్లే అంటున్నారు. మారిన రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు వంటి కారణాలతో ప్రస్తుతం రాజకీయ రంగమంతా గందరగోళంగా మారింది. ఈ సమయాన్నే తన రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక చేసుకోవాలని భాను నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది.

అయితే గతంలో పలు విషయాల్లో మీడియాకెక్కిన భాను ఒక దశలో అవసరమైన సమయంలో రాజకీయ రంగంలోకి వస్తానని ఇదివరకే చెప్పింది. దీంతో ప్రస్తుతం వివిధ పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయట. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X