Don't Miss!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్‌లో జస్ట్‌డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Sports వరల్డ్ కప్‌కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
మొగుడిపై నిహారికకు ఎంత ప్రేమో!.. అలా అనేసరికి ఏకంగా కొట్టేందుకే వచ్చేసిన మెగా డాటర్
మెగా డాటర్ నిహారికకు చైతన్యతో నిన్న (ఆగస్ట్ 13) నిశ్చితార్థమైంది. నిహారిక ఎంగేజ్మెంట్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా మొత్తం, తెలుగు మీడియాలో మెగా ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలే హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోల్లో నిహారిక ఎంత సంతోషంగా ఉందో ఆమె నవ్వును, మొహాన్ని చూస్తేనే అర్థమవుతోంది.
Recommended Video
మూడు ముళ్లు పడకముందే..
నిహారికకు మూడు ముళ్లు పడకముందే చైతన్యపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య చైతన్య బర్త్ డే సందర్భంగా నిహారిక చేసిన కామెంట్స్ ఎంతగానో వైరల్ అయ్యాయి. నువ్వే లోకం, నీ వల్లే ఈ నవ్వు, నీ కౌగిలిలోనే ప్రపంచం అంటూ భర్తపై ప్రేమను కురిపించింది.
భర్త గుండెలపై వాలింది..
ఇక తాజాగా నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా నిహారిక షేర్ చేసింది. భర్త గుండెలపై వాలిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ మురిసిపోయింది. కాబోయే భర్తకు ఉంగరాన్ని తొడుగుతూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక నిహారిక తాజాగా తన భర్తపై ఉన్న ప్రేమను చాటింది.
స్పెషల్ ఈవెంట్..
వినాయక చవితి సందర్భంగా జీ తెలుగు వారు బాపు బొమ్మకు పెళ్లంట అని నిహారికను స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానింది ఓ స్పెషల్ ఈవెంట్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ప్రోమోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పల్లకిలో పెళ్లి కూతురు..
రెండ్రోజుల క్రితం విడుదల చేసిన ప్రోమోలో పల్లకిలో ఎంట్రీఇచ్చిన నిహారికను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇక నాగబాబు కూడా ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించి భద్రపరుచుకున్నాడు. అప్పుడే అప్పగింతలు అయినట్టు ఎమోషనల్ అయ్యాడు.
తాజాగా పండు పర్ఫామెన్స్..
ఢీ ఫేమ్ పండు గత వారం పలాస సినిమాలోని నాదీ నక్కిలీసు గొలుసు పాటకు డ్యాన్స్ చేసి యూట్యూబ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పండు వేసిన లేడీ గెటప్ ఓ రేంజ్లో వర్కౌట్ అయింది. అంతే కాకుండా ఆ గెటప్‌లో టిక్ టాక్ ఫేమ్ దుర్గారావును ఇమిటేట్ చేయడంతో మరింతగా వైరల్ అయింది. ఇక తాజాగా పండు.. ఈ ఈవెంట్లోనూ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తోంది.
ఆ పాటకు డ్యాన్స్..
సిట్యువేషన్‌కు తగ్గట్టేమో గానీ 100 పర్సెంట్ లవ్ సినిమాలోని పిల్లా నీ బావనిస్తవా? అనే పాటకు పండు డ్యాన్స్ చేశాడు. ఇక అంతే నిహారిక తను కూర్చున్న ప్లేస్లోంచి లేచి వచ్చి మరి పండును తెగ బాదేసింది. కొట్టినా కూడా మళ్లీ ఆ పాటకు పండుతో కాలు కదిపింది. ఏది ఏమైనా నిహారికకు చైతన్య అంటే వల్లమాలిన ప్రేమ అని అర్థమవుతోంది.