జబర్దస్త్‌ను ఢీకొట్టేందుకు నాగబాబుకు నిహారిక సాయం.. కాపీ ‘అదిరింది’ అంటూ కామెంట్స్
జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో.. ఈ మధ్య కాలంలో అంతకు మించి వార్తల్లొ నిలిచింది. దానికి కారణం నవ్వుల నవాబు, టవర్ స్టార్ నాగబాబు. జబర్దస్త్ జడ్జిగా ఇన్నేళ్లు తన నవ్వులు, పంచ్‌లతో అందర్నీ నవ్వించిన నాగబాబు షోను వీడటం, బయటకు వెళ్లిన నాగబాబు షోపై ఆరోపణలు చేయడంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వేరే చానెల్‌లో కొత్త షోను ప్రారంభించిన నాగబాబు అండ్ టీమ్.. వాటిని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది.

నితిన్-భరత్‌ల మూలానా..
జబర్దస్త్‌ను సక్సెస్ చేయడంలో దర్శకులైన నితిన్-భరత్‌ల పాత్ర ఉందన్నది కాదనలేని సత్యం. అయితే వారికి, మల్లెమాల యాజమాన్యానికి వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా జబర్దస్త్ షోను వీడారు. వారిద్దరికి జరిగిన అన్యాయానికి అండగా నిలబడేందుకు తాను జబర్దస్త్‌ను వీడానని నాగ బాబు చెప్పడం సంచలనంగా మారింది.

లోకల్ గ్యాంగ్స్ అంటూ కొత్త షో..
అక్కడి నుంచి బయటకు వచ్చిన వీరంతా జీ చానెల్‌లో లోకల్ గ్యాంగ్స్ అనే కొత్త షోను ప్రారంభించారు. జబర్దస్త్ లీడర్లు, కంటెస్టెంట్లు ఇలా కొంతమందితో ఈ కొత్త షోను స్టార్ట్ చేశారు. అయితే వారు అనుకున్నంతగా ఇది రీచ్ కాలేకపోతోంది. దీంతో పాటే మరో కొత్త షోను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు.
ఆదివారం నాడు అదిరింది..
అదిరింది.. మాటల్లేవ్ మాట్లాడుకోవటాల్లేవ్.. అంటూ ఈ ఆదివారం ప్రారంభం కాబోయే కొత్త షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అనసూయ, రష్మీ లాంటి సూపర్, హైపర్ యాంకర్‌లకు అలవాటు పడ్డ బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి సమీరకు ఏమాత్రం కనెక్ట్ కాలేదని తెలుస్తోంది. ఎంత మాత్రం ఆమె మాటల్లో ఆ ఎనర్జీ కనిపించడం లేదని టాక్.

జడ్జిగా నాగబాబు.. అతిథిగా నిహారిక
ఆదివారం ప్రారంభం కాబోయే ఈ షోలో వేణు వండర్స్, ధన్ రాజ్, కిరాక్ ఆర్పీ, పటాస్ స్టేజ్ ఆర్టిస్ట్స్ లాంటి వారు దుమ్ముదులపబోతోన్నారు. ఈ షోకు నిహారిక ముఖ్య అతిథిగా హాజరుకానుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నిహారిక పంచ్‌లు కూడా అదిరిపోయాయి. ఎంతమంది ఉన్నారని కాదు.. ఎవరున్నారన్నది ముఖ్యం అంటూ పంచ్ డైలాగ్ వేయగా.. అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది.. ఇప్పుడే మొదలైంది అంటూ పవన్ డైలాగ్‌ను నాగబాబు చెప్పడం హైలెట్‌గా నిలిచింది.

కాపీ అదిరింది..
ఈ షో కొత్తగా ఏమీ లేదని జబర్దస్త్‌ను చూసినట్టుగానే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది నిలబడటం కష్టమని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్నేళ్లుగా ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చిన జబర్దస్త్‌ను ఢీకొట్టడం అంటే మామూలు విషయం కాదని అందరికీ అర్థమై ఉంటుంది.


Click it and Unblock the Notifications











