అలీ ‘ఎటిఎం’: కొణిదెల నిహారిక, మంచు లక్ష్మి సందడి
హైదరాబాద్: తెలుగు హాస్య నటుడు అలీ ఆ మధ్య ‘అలీ 369' పేరుతో ఓ రియాల్టీ షో నిర్వహించిన సంగతి తెలిసింది. ఈ షోలో పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. కొంత కాలం తర్వాత ఆ షో ఆపేసిన అలీ తాజాగా కొత్తగా ‘ఎటిఎం' అనే మరో గేమ్ షో ప్రారంభించారు.
ఇటీవల ఈ ‘ఎటిఎం' షోలో నాగ బాబు కూతురు కొణిదెల నిహారిక, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పాల్గొని సందడి చేసారు. ఈ షోలో ఇద్దరూ కూడా 7 లక్షలు గెలుచుకోవడం గమనార్హం. ఈషో గురించి నిహారిక తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పేరొంది. అలీ గారి ‘ఎటిఎం' గేమ్ షోలో మంచు లక్ష్మి గారితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

టీవీ షోలతో నిహారిక బిజీ
ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు కుమార్తె నిహారిక ఈటీవీలో ప్రసారం అవుతున్న 'ఢీ'-7 కార్యక్రమానికి యాంకర్‌గా మారి తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు మాత్రమే వచ్చారు. త్వరలో ఆ ఫ్యామిలీ నుంచి సినిమా హీరోయిన్ కూడా రాబోతుందనే సంకేతాలు నిహారిక జోరు చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తోంది. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాదిరి నిహారిక కూడా బుల్లితెర నుండి మొదలు పెట్టి వెండి తెర వైపు అడుగులు వేసే దిశగా తన ప్రయాణం కొనసాగిస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే నిహారిక సోషల్ నెట్కవర్కింగులో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా నిహారిక తన అందమైన ఫోటోలను విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రాజమౌళి తనయుడు కార్తికేయ రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్‌లో నాగ బాబు కూతురు నిహారిక, నాగార్జున తనయుడు అఖిల్ కలిసి నటించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











