కన్నుల పండువగా ఉత్సవం.. పల్లకిలో పెళ్లి కూతురు.. నిహారికను చూసి నాగబాబు ఎమోషనల్!!
మెగా డాటర్ నిహారికకు పెళ్లి ఘడియలు వచ్చేశాయ్. ఇప్పటికే కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది కూడా. కాబోయే భర్తతో జాలీగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటి వరకు నిహారికకు సోషల్ మీడియాలో ఎంతో మంది పెళ్లి చేశారు. ఆ హీరోతో , ఆ అబ్బాయితో అంటూ లెక్కలేనన్ని వార్తలు రూమర్లుగా వ్యాప్తి చేశారు. ఇక యూట్యూబ్‌లో అయితే మొత్తం నిహారిక పెళ్లి చుట్టే తిరిగేవి. ఇక అలాంటి వార్తలు మాయమైపోయాయి. ప్రస్తుతం నిహారిక తనకు కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

స్పెషల్ ఫోటోలు..
నిహారిక తన భర్త(చైతన్య) ఫోటోలను ఎంతో సస్పెన్స్ తరువాత రివీల్ చేసింది. మొదటగా ఘాడంగా హత్తుకున్న ఫోటోలను రిలీజ్ చేయగా..అందులో చైతన్య మొహాన్ని కనబడకుండా కవర్ చేసింది. ఇక తరువాత రిలీజ్ చేసిన ఫోటోల్లో నిహారిక, చైతన్యల జోడికి సూపర్ జోడి అంటూ కామెంట్స్ వచ్చాయి.

చైతన్య బర్త్ డే స్పెషల్..
చైతన్య బర్త్ డే వేడుకులను నిహారిక బాగానే సెలెబ్రేట్ చేసింది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డేకు స్పెషల్‌గా విష్ చేసింది. ‘ఈ ఒక్క చిరునవ్వు రూమ్ నిండా వెలుగులు నింపుతుంది. ఆ ఒక్క హగ్ సొంత నివాసంలా అనిపిస్తుంది. నువ్వే నా సంతోషానికి చిరునామా. ప్రపంచలోనే అత్యుత్తమమైనవన్నీ పొందగలిగే అర్హత ఉన్నవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్' అంటూ కాబోయే భర్తపై ప్రేమను కురిపించింది.

పెళ్లి కూతురుగా..
వినాయక చవితికి జీ తెలుగు చేసే ఓ స్పెషల్ ఈవెంట్‌లో నిహారిక సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో నిహారిక పెళ్లి కూతురు గెటప్‌లో వచ్చింది. పల్లకిలో నిహారికను తీసుకురావడం, బ్యాక్ గ్రౌండ్‌లో గీత గోవిందం పాట రావడం అంతా కన్నుల పండువగా అనిపించింది.
Recommended Video

నాగబాబు ఎమోషనల్...
ఇక కూతురుని పెళ్లి కూతురు గెటప్‌లో చూడటంతో నాగబాబు ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. పల్లకిలోంచి నిహారిక దిగుతూ ఉంటే నాగబాబు తన ఫోన్‌లో ఆ దృశ్యాన్ని షూట్ చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఒకవేళ నిహారిక పెళ్లి అయితే కూడా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయేమో అన్నట్టుగా ఉంది.


Click it and Unblock the Notifications











