Niharika Konidela: నా అసలు పేరు నిహారిక కాదు... సీక్రెట్‌ బయటపెట్టిన మెగా డాటర్

తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగుపెట్టారు నిహారిక కొణిదెల. అయితే నటిగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా నిర్మాతగా మాత్రం నిలదొక్కుకున్నారు. ఆమె నిర్మించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటున్నాయి. తాజాగా తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న డ్యాన్స్ రియాలిటీ షోలో నిహారిక కొణిదెల సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరు అనుకుంటున్నట్లు తన పేరు నిహారిక కాదని.. అసలు పేరు వేరే ఉందని షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

కలిసిరాని నటన
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నిర్మాత నాగబాబు గారాలపట్టి నిహారిక. మెగా ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కెరీర్ ‌పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు నిహారిక. తొలుత బుల్లితెరపై హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారికకు తొలి సినిమాయే షాకిచ్చింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి, డార్లింగ్ తదితర సినిమాలలో నటించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో బ్యానర్ స్థాపించిన నిహారిక పలు వెబ్‌సిరీస్‌లు నిర్మించారు. అనంతరం కమిటీ కుర్రోళ్లు సినిమాను నిర్మించి.. నిర్మాతగా తొలి చిత్రానికే గద్దర్ అవార్డ్ అందుకున్నారు నిహారిక.

Niharika Konidela Shocks Fans by Revealing Her Real Name on Dance Reality Show Aata

చైతన్యతో పెళ్లి, విడాకులు
ఇదే సమయంలో చైతన్య జొన్నలగడ్డకు నిహారికతో 2020లో వివాహం జరిగింది. కొన్నాళ్లు ఈ జంట సజావుగానే కాపురం చేసినప్పటికీ ఆ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో 2023లో విడాకులు తీసుకున్నారు. దాంతో మానసికంగా బాగా కృంగిపోయిన నిహారిక.. కొన్నాళ్ల తర్వాత తిరిగి యాక్టీవ్ అయ్యారు. నిర్మాతగా నిలదొక్కుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహకారంతో మంచి స్క్రిప్ట్స్ రెడీ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులతో సినిమాలు చేస్తానని చెబుతున్నారు నిహారిక. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను మెగా డాటర్ నిర్మిస్తున్నారు.

ఆట షోకు శ్రీకారం
కాగా.. తెలుగులో డ్యాన్స్ రియాలిటీ షోలకు శ్రీకారం చుట్టిన కార్యక్రమం ఆట. ఈ షో ద్వారా ఎందరో ప్రతిభావంతులు తమ టాలెంట్ నిరూపించుకుని ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మంచి స్థానంలో ఉన్నారు. తాజాగా ఆట డ్యాన్స్ షో కొత్త సీజన్ ఫిబ్రవరి 7వ తేదీన జీ తెలుగులో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకు నిహారిక కొణిదెల జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు అలనాటి నటి రాధిక శరత్ కుమార్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌లు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే కావ్యశ్రీ, విష్ణుప్రియ, సమీరా భరద్వాజ్‌, వంశీలు ఈ షోకు మెంటార్స్‌గా వ్యవహరిస్తుండగా.. 16 మంది ప్రతిభావంతులు పోటీపడుతున్నారు.

అసలు పేరు చెప్పిన నిహారిక
తాజాగా ఈ కార్యక్రమంలో నిహారిక స్వయంగా డ్యాన్స్ చేసి కంటెస్టెంట్స్‌ను, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ ఆమెను టీజ్ చేశాడు. ఒక డ్యాన్స్ చేసి, చిన్న స్టెప్ మీరు వేయాలి, లేదంటే ఓ పాట పాడతారా అని అడిగితే సీరియస్‌గా చూశారు. ఇప్పుడు రాగానే డ్యాన్స్ చేశారు. అసలు మీరు అంత సింక్‌లో ఎలా వేశారని సుధీర్ ప్రశ్నించాడు. దానికి నిహారిక ఆన్సర్ ఇస్తూ... నేను పుట్టినప్పుడు నా పేరు నిహారిక అని పెట్టాలని అనుకోలేదట. నా ఫస్ట్ పేరు వర్ష, మా అన్న పేరు వరుణ్. అలా పెడదామని అనుకున్నారు. అయితే నాన్నగారు ఎక్కడో చూసి నిహారిక అనే పేరు చాలా మంచిదని అలా ఫిక్స్ చేశారు. కానీ నాకు వర్ష అనే పేరు చాలా ఇష్టం. ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియదని నిహారిక షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X