Nikhil Kavya: ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్.. నిఖిల్‌కి కావ్య స్ట్రాంగ్ కౌంటర్..
Nikhil Kavya:బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ నిఖిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అతడు తన ఆట తీరుతో ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తూ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తన బ్రేకప్ లవ్ స్టోరీని, తన లవర్ కావ్య గురించి చెబుతూ చాలామందిని ఎమోషనల్ చేశారు. తన ప్రేయసి కోసం ఎంతగానో పరితపిస్తున్నట్లు నటించారు దీంతో కావ్య కూడా తాను నమ్మడం లేదంటూ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాను మాత్రం ఆమె ప్రేమను మర్చిపోలేనట్టు, తనని కలిసే ప్రయత్నం చేస్తానని, తన ప్రేమను మరోసారి వ్యక్తపరస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అది మాటల వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఏమైందంటే..
బిగ్ బాస్ టైటిల్ ను నిఖిల్ గెలుస్తాడో? లేదో? అన్న విషయం కంటే.. బిగ్ బాస్ షో పూర్తి అయినా తరువాత నిఖిల్, కావ్యలు కలుస్తారా? లేదా? అన్న విషయమే ఎక్కవ వైరల్ గా మారింది. వీరిద్దరూ కలువాలని బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూశారు. బిగ్బాస్ టైటిల్ విన్నర్ అయిన తర్వాత నిఖిల్ కావ్యను కలవడానికి వెళ్తాడని ఎంతోమంది భావించారు. కానీ, బిగ్ బాస్ పూర్తయి దాదాపు రెండు వారాలు గడుస్తున్న నిఖిల్ తన మాట మీద లేడనే చెప్పాలి. ఇప్పటివరకు కావ్య విషయంలో నిఖిల్ మాట తప్పడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో కావ్య నిఖిల్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. అది కూడా 'స్టార్ మా' లో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaaram with Star Maa Parivaaram). యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా సీరియల్ పరివారం వర్సెస్ బిగ్ బాస్ పరివారం అంటూ ఓ సరికొత్త గేమ్ షోను ప్లాన్ చేశారు. ఈ ప్రొగ్రామ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు,సీరియల్ యాక్టర్స్ సందడి చేశారు. అయితే బిగ్బాస్ పరివారంలో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తో పాటు ఇతర కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మరోవైపు సీరియల్ పరివారం టీంలో నిఖిల్ మాజీ లవర్ కావ్య కూడా పాల్గొంది.
ఈ గేమ్ షో లో యాంకర్ శ్రీముఖి వీళ్లిద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టినట్లే అనిపిస్తుంది. ప్రోమో స్టార్టింగ్ లో 'సీజన్ 8 వాళ్లు అందరూ నిన్ను ఫేస్ టు ఫేస్ కలవడానికి వస్తున్నారు. నీ ప్రిపరేషన్ ఎలా ఉంది ? 'అని కావ్యను శ్రీముఖి అడుగుతుంది. దీంతో కావ్య సమాధానమిస్తూ 'నో ప్రిపరేషన్' అని బదులుస్తుంది. 'వాళ్లకు అంత సీన్ లేదా' అని శ్రీముఖి మరో ప్రశ్న వేయగా.. 'వాళ్లకు అంత లేదు' అంటూ సీరియస్ గా రేంజ్ లో లూక్కిస్తుంది. ఆ డైలాగుతో ముక్కు అవినాష్ రియాక్ట్ అవుతూ.. 'మాకు అంత సీన్ లేదా?' అంటూ వెటకారంగా ప్రశ్నిస్తాడు.
'నాటకాలు వద్దు.. చక్కగా వెళ్ళిపో' అంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది. ఆ డైలాగుతో శ్రీముఖి కూడా రెచ్చిపోతుంది.. 'కావ్య అంటే ఫైర్ అనుకున్నావా' అని శ్రీముఖి అనగానే..'నీ అవ్వ వైల్డ్ ఫైర్' అంటూ కావ్య మాస్ వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో శ్రీముఖి తగ్గకుండా.. 'బిగ్ బాస్ ఫస్ట్ కంటెస్టెంట్ నుండి విన్నర్ వరకు వినిపించాలి' అంటూ నిఖిల్ ను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తుంది. కట్ చేస్తే.. నిఖిల్ మాస్ ఎంట్రీ ఇస్తాడు.
నిఖిల్ కు శ్రీముఖి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ.. షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్లను పరిచయం చేస్తూ 'అటు బిగ్ బాస్ పరివారం.. ఇటు సీరియల్ పరివారం.. అందర్నీ ఓ లుక్కు చూడు' అని ఇన్ డైరెక్టుగా కావ్య ను నిఖిల్ కు చూపిస్తుంది. దీంతో నిఖిల్ కూడా 'యా యా అందరినీ చూస్తున్న' అంటూ కావ్యను చూస్తాడు. బ్యాగ్రౌండ్ లో ఒక లవ్ సాంగ్ వేయగానే షో మొత్తం దద్దరిల్లిపోతుంది. అంతటితో ఆగకుండా శ్రీముఖి.. నిఖిల్ ని ప్రశ్నిస్తూ.. ఈ షోలో అందరికంటే ఎక్కువ బ్యూటిఫుల్ ఎవరు అంటూ ప్రశ్నిస్తోంది. దానికి నిఖిల్ బదులిస్తూ 'అందరికీ తన సమాధానం తెలుసు కదా' అంటాడు. ఈ మేటర్ లో రోహిణి కలగజేసుకొని.. తెలుసు బాబు నీ నోటి నుండి చెప్పాలి కదా అంటూ కౌంటర్ ఇస్తుంది.
దీంతో రియాక్ట్ అయిన కావ్య.. 'ఆయన ఇక్కడెందుకు చెప్తాడు. బిగ్ బాస్ హౌస్ లో చెప్తారు' అంటూ ఓ రేంజ్ లో కౌంటర్ వేస్తుంది. ఆ సమాధానం విన్న శ్రీముఖి షాక్ అవుతుంది. ఆ తర్వాత కావ్య ఫోటోను చూపించి ఎలాగుందంటూ నిఖిల్ అడుగుతుంది శ్రీముఖి. దానికి సమాధానం చెప్పలేక తల పట్టుకుంటాడు. లాస్ట్ లో నిఖిల్ తన తల్లిని స్టేజ్ పైకి పిలిచి.. తన అమ్మ లేకపోతే నేడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ని కాలేకపోయే వాడినట్టు ఎమోషనల్ అవుతాడు. అయితే ఈ షో తర్వాత అయినా నిఖిల్- కావ్యలు కలుసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











