Bigg Boss Telugu 8: కన్నడ బ్యాచ్‌ని నిఖిల్ ముంచేశాడా?.. ఈ వారం ఒకరు ఔటేనా?
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 9 వారాలు పూర్తి చేసుకుని పదో వారంలోకి అడుగుపెట్టింది. 10వ వారం నయని పావన్ ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎవరు హౌస్‌ను వీడతాడోనని టెన్షన్ నెలకొంది. ఈ సీజన్‌లో కన్నడ బ్యాచ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నలుగురు .. ఈసారి నామినేషన్స్‌లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇలా ఒకేసారి అంతా నామినేషన్స్‌లోకి ఎలా వచ్చారు? ఆడియన్స్ వీళ్లపై రగిలిపోతున్నారా? నిఖిల్ వరుసగా ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ఈ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల హవా నడుస్తోంది. అర్చనా అనంత్, శోభాశెట్టి, ఐశ్వర్య పిస్సే, రక్షా గౌడ, మంజుల, నవ్య స్వామి, తేజస్విని గౌడ, అషికా పదుకొనె వంటి భామలతో పాటు పలువురు కన్నడ అబ్బాయిలు కూడా తెలుగు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు.. తెలుగు బిగ్‌బాస్‌లోనూ కన్నడ నటీనటులు కంటెస్టెంట్స్‌గా వచ్చి ఇక్కడా తమ జైత్రయాత్ర మొదలుపెట్టారు. గత సీజన్‌లో కర్ణాటకకే చెందిన శోభాశెట్టి, పూజామూర్తిలు ఎంట్రీ ఇచ్చి టఫ్ ఫైట్ ఇచ్చారు.

ఈ కల్చర్‌ను బిగ్‌బాస్ తెలుగు 8 లోనూ కంటిన్యూ చేశారు. ఈసారి ఏకంగా నలుగురు కన్నడిగులకు అవకాశం కల్పించారు. వారే నిఖిల్, యాష్మీ గౌడ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ శెట్టి . వీరంతా ఒక బ్యాచ్‌లా మారి తెలుగు కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కన్నడ బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ హౌస్‌లో ఉండగానే కిర్రాక్ సీత సంచలన వ్యాఖ్యలు చేసింది. పృథ్వీరాజ్, ప్రేరణ పక్కనే ఉండగా.. ఏంది బిగ్‌బాస్ ఈ కన్నడొళ్లు అందరినీ తెచ్చావ్ అంటూ మండిపడింది.
ఈ కన్నడ బ్యాచ్ మొత్తాన్ని నిఖిల్ లీడ్ చేస్తున్నాడు. ఓజీ క్లాన్ చీఫ్‌గా మొత్తం హౌస్‌ను తానే నడిపిస్తున్నాడు. అప్పుడప్పుడూ బ్యాలెన్స్ కోల్పోతున్నా, తిరిగి గాడిలో పడుతున్నాడని జనం ఓట్లు వేస్తున్నారు. అయితే గత కొద్దివారాలుగా ఓటింగ్‌లో స్పష్టమైన మార్పులు వస్తున్నాయి. నిఖిల్ ఓటింగ్‌లో ఉంటే ఖచ్చితంగా టాప్ ప్లేస్ తనదే, కానీ లాస్ట్ కొన్ని వీక్స్‌గా ఓటింగ్‌లో పడిపోతున్నాడు. గత వారం తన ఫ్రెండ్స్ ప్రేరణ, యష్మిలను ఫిజికల్‌గా అటాక్ చేయడంతో నిఖిల్‌పై నెగిటివిటీ పెరిగిపోయింది. దీంతో తనకేమైంది, ఎందుకిలా దిగజారిపోతున్నాడని బిగ్‌బాస్ లవర్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రేరణ, యష్మి, పృథ్వీలను అడ్డుపెట్టుకుని నిఖిల్ గేమ్ ఆడాడని.. ఆయన వారిని చాలా ఎక్కువగానే దెబ్బతీశాడని, అందరిలోకి ప్రేరణ ఎక్కువ లాస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్నటి గేమ్‌లో గౌతమ్ పైచేయి సాధించే సమయంలో నబీల్‌ను బాగా ఎంకరేజ్ చేసి అతని దృష్టిలో మంచి మార్కులు కొట్టేశాడని.. కానీ అదే నబీల్ గురించి బ్యాడ్‌గా చెబుతాడని ఇది నిఖిల్ క్యారెక్టర్ అంటూ చర్చించుకుంటున్నారు. అందరి దృష్టిలో తాను మంచిగా కనిపించడానికి ఈ కన్నడ బ్యాచ్‌ను రెచ్చగొట్టి నెగిటివిటీ తీసుకొచ్చి తాను లబ్ధి పొందుతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇకనైన నిఖిల్ మైండ్ గేమ్‌ని అర్ధం చేసుకోవాలని.. ఆల్రెడీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఓటింగ్‌లో పృథ్వీ, యష్మిలు డేంజర్ జోన్‌కి దగ్గరగానే ఉన్నట్లుగా చురకలంటిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం.


Click it and Unblock the Notifications











