Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షోలోకి స్పెషల్ లేడీస్.. అతడు ఆమెతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో!
తెలుగులో ఇప్పటి వరకు ప్రసారం అయిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' చాలా ప్రత్యేకమనే చెప్పాలి. సరికొత్త థీమ్‌తో వచ్చిన ఈ షో తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకుంది. అందుకే మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ఎక్కువ టీఆర్పీ రేటింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో... ఇప్పుడు ఎనిమిదో దానితో వచ్చింది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హౌస్‌లో స్పెషల్ లేడీస్ సందడి చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్‌కు మాత్రమే తెలుగు బుల్లితెరపై భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే అన్‌లిమిటెడ్‌గా వినోదాన్ని ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 14 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు.

ఎన్నో అంచనాలతో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో గెలుపొందిన విజేత కోసం ప్రైజ్ మనీని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. పైగా ఈ సారి ఆడుకుని డబ్బును పెంచుకోవాల్సి ఉంటుందని కూడా బిగ్ బాస్ వెల్లడించాడు. అందుకు అనుగుణంగానే ఈ వారంలో హౌస్‌లోకి కంటెస్టెంట్ల కోసం కొన్ని టాస్కులను కూడా ఇస్తున్నారు. దీనిబట్టి ప్రైజ్ మనీని పెంచుతున్నారు.

ఎనిమిదో సీజన్ రెండో వారంలో బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు ట్రూత్ ఆర్ డేర్ అనే టాస్కును ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇందులో బాటిల్ తిప్పగా అది ఎవరి వైపు ఉంటుందో వాళ్లు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. అలా ముందుగా విష్ణుప్రియ.. ఆదిత్య ఓంను అమ్మాయిలా తయారు చేసి రచ్చ లేపేసింది.
ట్రూత్ ఆర్ డేర్ టాస్కులో భాగంగా నైనికను ఎవరైనా అబ్బాయిని బలవంతంగా తీసుకు వెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలని శేఖర్ బాషా చెప్పాడు. దీంతో ఆమె అతడినే లాక్కుని వెళ్లి పడేసింది. అప్పుడు శేఖర్ కూడా నైనికను స్విమ్మింగ్ పూల్‌లోకి లాగి పడేశాడు. ఆ తర్వాత నిఖిల్ అమ్మాయి గెటప్ వేసుకుని కనిపించాడు. దీంతో బిగ్ బాస్ పాటను ప్లే చేయగా అందరూ కలిసి అతడితో డ్యాన్స్ చేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగబోతున్నట్లు ప్రోమోను బట్టి చూస్తే అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











