Bigg Boss 8 Voting : ఓటింగ్‌లో నిఖిల్ బీభత్సం.. డేంజర్ జోన్‌లో టాప్ వైల్డ్ కార్డు ఎంట్రీలు!

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ఏడో వారంలోకి అడుగుపెట్టింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన వారిని రాయల్ క్లాన్‌గా, పాత కంటెస్టెంట్స్‌ని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కిర్రాక్ సీత ఎలిమినేషన్‌తో పాత కంటెస్టెంట్స్‌లో ఏడుగురు మిగలగా.. రాయల్ క్లాన్ సభ్యులు 8 మంది కలిపి మొత్తంగా ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 15 మంది ఉన్నారు. సోమవారం వచ్చిందంటే నామినేషన్స్ రచ్చ మామూలుగా ఉండదు.. మరి 7వ వారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరెవరు నామినేట్ అయ్యారు.. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ వారం నామినేషన్స్‌లో ప్రతి ఒక్కరూ అర్హులేనని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. ఎవరు నామినేట్ అయ్యేది హరితేజ, ప్రేరణ చేతుల్లో పెట్టాడు. అలాగే మెగా చీఫ్ అయిన కారణంగా మెహబూబ్‌ను ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ కండీషన్ పెట్టాడు . ముందుగా రోహిణి.. గౌతమ్‌ని నామినేట్ చేసింది. తనను అశ్వత్థామ 2.0 అని అవినాశ్ హేళన చేశారంటూ గౌతమ్ కృష్ణ కోప్పడటాన్ని పాయింట్‌గా తీసుకుని రోహిణి అతనిని నామినేట్ చేసింది. సరదాగా సాగిపోతున్న ఆటను గౌతమ్ సీరియస్‌గా మార్చేశాడని రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది.

nikhil maliyakkal top in bigg boss telugu 8 7th week voting here s the details

దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకుంటూ అది హేళన చేయడం కిందకే వస్తుందన్నాడు. నాకు నచ్చని పదాన్ని అదే పనిగా చెప్పడం గేలి కిందకే వస్తుందని రంకెలు వేశాడు. గొడవ పెద్దదవుతుండటంతో అవినాశ్ కూల్ చేసే ప్రయత్నం చేశాడు. మనం వచ్చింది బిగ్‌బాస్ షోకి అని.. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో అవినాశ్‌కి కోపం వచ్చింది. కామెడీ అంటే చీప్‌గా కనిపిస్తుందా.. కామెడీని రిసీవ్ చేసుకోలేనప్పుడు, డబ్బులు తీసుకోవద్దు, షోకు రావొద్దంటూ తన జాకెట్ నేలకేసి కొట్టారు. తర్వాత గౌతమ్‌‌కి సారీ చెప్పి మోకాళ్ల మీద కూర్చోవడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు.

సోమవారం నాటి ఎపిసోడ్‌లో రోహిణి.. గౌతమ్‌ని, నిఖిల్.. టేస్టీ తేజాని, యష్మీ.. టేస్టీ తేజాని, మణికంఠ .. నిఖిల్‌ని, అవినాష్.. మణికంఠని, గౌతమ్.. విష్ణుప్రియ, గంగవ్వ .. పృథ్వీని నామినేట్ చేశారు. అప్పటికే సమయం ముగియడంతో మిగిలిన నామినేషన్ల కార్యక్రమం మంగళవారానికి వాయిదాపడింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి ఏడో వారం ఏకంగా 9 మంది నామినేషన్స్‌లో ఉన్నారట. వారు హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తే :

క్లాన్ చీఫ్‌గా, స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ (17.10 శాతం) ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నారు. అతనికి నబిల్ (16.63 శాతం) ఓటింగ్‌తో గట్టి పోటీ ఇస్తున్నారు. తర్వాతి స్థానాల్లో యష్మీ గౌడ (14.70 శాతం), నాగమణికంఠ (13.34 శాతం), ప్రేరణ (12.72 శాతం), గౌతమ్ (10.09 శాతం), పృథ్వీ (8.23 శాతం)లు సేఫ్ జోన్‌లో నిలిచారు. హరితేజ (6.82 శాతం), టేస్టీ తేజ (2.71 శాతం)లు మాత్రం లీస్ట్ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా టైం ఉండటంతో ఈలోపు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X