గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్థం చేసుకున్న యంగ్ హీరో.. పెళ్లి కూతురు ఎవరంటే..?
హ్యాపీడేస్ సినిమాతో అందర్నీ మెప్పించిన నిఖిల్.. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికిపోతావు చిన్నివాడా లాంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్‌గా అర్జున్ సురవరం అంటూ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే లైన్లో చాలానే ప్రాజెక్ట్‌లు ఉన్నా.. ప్రస్తుతానికైతే విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన జీవితంలో ముఖ్యమైన ఓ విషయం గురించి చెప్పేశాడు. అదేంటో ఓ సారి చూద్దాం.

ప్రేమ పెళ్లి చేసుకోవాలనే కోరిక..
గతంలో ఓసారి మంచు లక్ష్మీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని.. తనకు కాబోయే భార్య గురించి మొట్టమొదటగా హింట్ ఇచ్చాడు. చిన్నప్పుడు షారుఖ్ ఖాన్ సినిమాలు చూసినప్పుడల్లా.. నేను కూడా ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, అయితే ఇంత వరకు ఆ అవకాశం రాలేదని అప్పుడు చెప్పుకొచ్చాడు. ఓ రెండు మూడు నెలల క్రితమే ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని, తనంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు.

వృత్తిరిత్యా డాక్టర్..
ఆమె ఒక డాక్టర్ అంటూ.. తనెప్పుడు తనను డిస్టర్బ్ చేయదని ఆమె గురించి చెప్పసాగాడు. షూటింగ్‌లో ఉండే ఫోన్ చేయదనీ, తన ఫోన్ కూడా చెక్ చెయ్యదనీ చెప్పుకొచ్చాడు. తను చాలా మంచిదని, పార్టీలకు వెళ్లినా అడగదని తెలిపాడు. ఫ్రెండ్స్‌తో ఉంటే కూడా ఏమనదనీ, సరే లేట్ అయినా పర్లేదని అంటుందని కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు.

గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్..
అయితే తన ప్రేమ వ్యవహారం గురించి బయటకు చెప్పిన నిఖిల్.. నిశ్చితార్థం చేసుకున్నాడు. అంతా అయ్యాక సోషల్ మీడియాలో వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయని, డాక్టర్ పల్లవితో తన ఎంగేజ్‌మెంట్ జరిగిందని ఇద్దరు అన్యోన్యంగా ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

పుట్టబోయే పాప పేరు కూడా ఫిక్స్...
అయితే మంచు లక్ష్మీ షోలో మాట్లాడుకుంటూ.. తనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమని, తన చెల్లెలి కూతరు తన దగ్గరే ఎక్కువగా ఉంటుందని, తనంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. తనకు పుట్టబోయే పాప పేరు కూడా ఫిక్స్ చేశానని.. ‘మాయా సిద్దార్థ్' అంటే ఎంత బాగుంది కదా అంటూ తన మనసులోని కోరికలను చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం తన కల నిజమవుతుందా? లేదా? అని.


Click it and Unblock the Notifications











